రేపటి నుంచి బూస్టర్ డోసు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రజలకు బూస్టర్ డోసు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.
- కరోనా కట్టడికి సర్కారు పటిష్ట చర్యలు
- 18 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్
- సంగారెడ్డి జిల్లాలో 4 కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు
- ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు
- సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ వెల్లడి
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 22 : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రజలకు బూస్టర్ డోసు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి సంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బూస్టర్ డోసు అందించనున్నారు. వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో 18 ఏండ్లు నిండి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని బూస్టర్ డోసు తీసుకోని వారందరికీ ఈ నెల 24 నుంచి ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్బియాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసు గా ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ డోసును తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కోవాక్సిన్, కోవీ షీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో బూస్టర్ డోసు పంపిణీకి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సంగారెడ్డిలోని మార్క్స్‌నగర్‌లో గల యూపీహెచ్సీ, పటాన్‌చెరులోని ఏరియా దవాఖాన, నారాయణఖేడ్‌లోని ఏరియా దవాఖానలో బూస్టర్ డోసు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 24 నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ డోసు ఇవ్వనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆయా కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
జిల్లాలోని వారందరూ బూస్టర్ డోసు తీసుకుని క రోనా వ్యాప్తిని అరికట్టాలి. జిల్లాలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు 4 వ్యాక్సిన్ పంపిణీ కేంద్రా లు ఏర్పా టు చేశాం. ఇప్పటికే కోవాక్సిన్, కోవీ షీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకోని పక్షంలో ఈసారి విధిగా చేయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్బియాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా ఉచితంగా అందిస్తున్నది. ఈ వ్యాక్సిన్‌ను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏండ్లు నిండి ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారు ఈ బూస్టర్ డోసును తీసుకోవాలి.
– డాక్టర్ శరత్, కలెక్టర్, సంగారెడ్డి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

