మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట పట్టణ శివారులోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్ నుండి ఆటోలో వస్తున్న 14 మంది విద్యార్థులు ముగ్గురు టీచర్లు రామాయంపేటకు వస్తున్నారు. మార్గమధ్యంలోని బైపాస్ వద్ద వెనుక నుండి లారీ ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. మిగతా విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ దావాఖానలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.