విద్యార్థుల జీవితాలతో బీజేపీ ఆటలు
తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- విద్యార్థులు, తల్లిదండ్రులు బీజేపీ కుట్రలను గమనించాలి
- మెదక్‌లో మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య
మెదక్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పిల్లలతో బీజేపీ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని, పిల్లల భవిష్యత్‌తో బీజేపీ చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. బీజేపీ కుట్రలు బయటపడ్డాయని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక, చేతకాక బీజేపీ నేతలు దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు ఆ పార్టీ నేతలు సమర్థించడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం గురిస్తున్నదని, వారికి రాజకీయ సమాధి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పథకం ప్రకారం బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పసి పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటేనే ఒక విచ్చినం, విద్వేషం చేసే కుట్ర అని, రాజకీయాల కోసం, అధికారం కోసం ఏదైనా చేసేదానికి ఆ పార్టీ నాయకులు పాల్పడతారన్నారు. బీజేపీ కుట్రలో ఎవరూ చిక్కుకోవద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు. పిల్లలు చదువుపై దృష్టిపెట్టాలని, ఈ విషయంలో తల్లిదండ్రులకు జాగరూకతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మవద్దని, తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. బీజేపీ పాలిత యూపీ, గుజరాత్లో పేపర్ లీకేజీలు నిత్య కృత్యమేనని తెలిపారు.
అక్కడి ప్రభుత్వాల నుంచి ఇక్కడ పేపర్లు లీకు చేయడానికి మీరు అనుభవం గడించారా అని బండి సంజయ్‌ను మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, టీఎస్పీఎస్ లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్‌హ్యాండెడ్‌గా బయటపడ్డాయని అన్నారు.సీఎం కేసీఆర్ ముందు బీజేపీ నేతల పప్పులు ఉడకవని, వారి కుట్రలను తిప్పికొడతామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లాగా గుండాగిరీ తెలంగాణలో ఎట్టి పరిస్థితిల్లో అనుమతించమని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నాయకులకు చీము, నెత్తురు ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

