ఘనంగా ఈస్టర్ పండుగ
ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో(చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి
- చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు
- దైవసందేశం ఇచ్చిన పాస్టర్లు
- సిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభం
- ప్రత్యేక గీతాలు ఆలపించి క్రీస్తును ఆరాధించిన భక్తులు
- కిటకిటలాడిన మెదక్ చర్చి
- ఉమ్మడి జిల్లాలో భక్తిశ్రద్ధలతో పండుగ
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 17: ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో(చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. ఈస్టర్ను పురస్కరించుకుని మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
సిలువ ఊరేగింపుతో ప్రారంభమైన వేడుకలు..
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్‌సుకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4.30 గంటలకు సిలువ ఊరేగింపుతో ఈస్టర్ వేడుకలు చర్చి బయట ప్రాంగణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈస్టర్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సిలువకు మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువుల భక్తి సూక్తుల మధ్య భక్తి గీతాలు ఆలపించారు. యేసు సమాధి నుంచి లేచి వచ్చిన సందేశాలతో భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కొంతమంది క్రైస్తవులు తమ ఆప్తుల సమాధుల వద్ద ఆదివారం తెల్లవారు జామున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.
మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు
– ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్‌సుకుమార్
మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు. యుగయుగాలకు యేసయ్య సజీవుడై ఉంటాడని మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్‌సుకుమార్ అన్నారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు సందేశం చేశారు. క్రీస్తు సమాధిలో నుంచి లేచి వచ్చిన శుభవేళనే ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నమన్నారు. అంతకుముందు చర్చి పాస్టర్లు సందేశం చేశారు. వేడుకల్లో చర్చి పాస్టర్లు, రాజశేఖర్, దయానంద్, జైపాల్, రిచర్డ్స్ చర్చి కమిటీ సభ్యులు శాంతికుమార్, రోలాండ్‌పాల్, సునీల్, గెలెన్, సాలోమాన్, ఉదయ్ కిరణ్, సువన్ డగ్లస్, శాంసన్ సందీప్, సుశీల్ కుమార్, వసతి గృహాల మేనేజర్ జాయ్ ముర్రే తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- celebrations
- Church
- Easter
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

