డ్రగ్స్ మాట వినపడొద్దు
సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాస్థాయి నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ సమావేశం నిర్వహించారు.
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట కలెక్టరేట్, జూలై11: సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాస్థాయి నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల బారిన ప్రజలు పడకుండా వాడడం, రవాణా, క్రయ విక్రయాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్ నివారణ విషయం మీద వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. తరగతుల వారీగా యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బడికి రా ని, బడి మానేసిన పిల్లల వివరాలు సేకరించి డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీఈవోకు సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో గంజాయి పెంచకుండా రైతులకు చెప్పాలన్నారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మత్తు చాక్లెట్లు, ఇతరత్రా పదార్థాల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్‌కు 14446, 8712671111 సమాచారం అందించాలని కలెక్ట ర్ సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మల్లారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, రామ్మూర్తి, ఎక్సై జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

