పాపన్నపేట, సెప్టెంబర్ 23 : మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్, కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. ఎంపికను పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, హెచ్ఎం మహేశ్వర్ ప్రారంభించారు. ఈ పోటీలలో మెదక్ జిల్లా నుండి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరు రాష్ట్రస్థాయిలో సిరిసిల్లలో జరిగే కబడ్డీ పోటీలలో పాల్గొననున్నారు. ఇందులో 20 సంవత్సరాలలో బాల బాలికలు 24 మందిని ఎంపిక చేసినట్లు పాపన్నపేట ఫిజికల్ డైరెక్టర్ రమేష్ వెల్లడించారు.
ఈ ఎంపిక కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడి అసోసియేషన్ సెక్రటరీ శివకుమార్, సంగారెడ్డి జిల్లా నుండి ఎల్లయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రభు, మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు రవి,కుమార్, సాయిలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో పాపన్నపేట చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.