Collector Rahul Raj | భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు : కలెక్టర్ రాహుల్ రాజ్
భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
చిలిపిచెడ్,మే 8 : భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రాజెక్టుగా చిలిపిచెడ్ మండలం ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిలిపిచెడ్ మండలంలోని గంగారం, శేరిఫైజాబాద్ గ్రామాల్లో భూ భారతిలో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేర్లు తప్పులు, భూమి విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారన్నారు. అలాగే నిర్దేశిత గడువు లోపు భూములు పరిష్కరిస్తారన్నారు.
మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాక జిల్లాలోని అన్ని మండలాల్లో జూన్ మొదటి వారంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్ధార్‌ను అదేశాంచారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్లు సహాదేవ్, ఆంజనేయులు, డిప్యూటి తహసీల్దార్లు సింధూజ, షఫి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

