రైతుల సందేహాలు నివృత్తి చేయాలి
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ, బ్యాంకు సిబ్బందిని సన్మానించారు.
- మొదటి విడత 47,978 మంది రైతులకు రుణమాఫీ
- వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్, (నమస్తే తెలంగాణ)/ రామాయంపేట, జూలై 25: రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ, బ్యాంకు సిబ్బందిని సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ ప్రక్రియను బ్యాంకు, వ్యవసాయశాఖ సిబ్బంది వేగవంతంగా కొనసాగిస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో లక్షలోపు పంట రుణమాఫీకి రూ.238.81కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలోని రైతులు 47, 978 మందికి పంట రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల రుణమాఫీ బ్యాంకుల్లో జమ కాలేదన్నారు.
ప్రజారోగ్య రక్షణకే వైద్య శిబిరాలు: జిల్లా వైద్యాధికారి శ్రీరాం
ప్రజారోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వైద్యాధికారి శ్రీరాంలు అన్నారు. సుతారిపల్లిలో వైద్య శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్, డీఎంహెచ్వో మాట్లాడారు. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న గ్రామస్తులకు వైద్య శిబిరాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. వ్యాధులు ఎదుర్కోవడానికే వైద్య సిబ్బందిని సమాయత్తం చేస్తున్నామన్నారు. ఆరోగ్య రక్షణకే వైద్య శిబిరాలు పని చేస్తాయన్నారు. ఇంటింటా సర్వేల ద్వారా జ్వర పీడితులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వ్యక్తిగత పరిశుభ్రత, నీటి నిల్వలపై సారిస్తున్నట్లు తెలిపారు.
అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో జిల్లాలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని, విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్యలుంటే త్వరితగతిన పరిషరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అంటువ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను ఆరోగ్య విషయంలో చైతన్యవంతం చేయాలని అధికారులకు సూచించారు.
గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలనీ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, వైద్యాధికారి శ్రీరామ్, రామాయంపేట సీహెచ్సీ వైద్యుడు లింబాద్రి, డి.ధర్మారం వైద్యురాలు హరిప్రియ, వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ, బ్యాంకు మేనేజర్ నందకిశోర్ సుతారిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాగి సంధ్య, ఉమామహేశ్వర్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

