మాఫీ..మాయాజాలం !
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టగానే మాట తప్పడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై పెల్లుబికుతున్న ఆగ్రహం
- రుణమాఫీ వడపోతపై రైతుల్లో అసహనం
- బ్యాంకుల్లో ఇంకా జమకాని రుణమాఫీ డబ్బులు
- పెరుగుతున్న ఫిర్యాదుదారుల సంఖ్య
- డీసీసీబీలో సగం మంది రైతులకే రుణమాఫీ
- రుణమాఫీకి ఎస్బీఐ సీడెడ్ సంఘాల రైతులు దూరం
- సర్కారు తీరుపై రైతులు, రైతు సంఘాల ఆగ్రహం
సంగారెడ్డి, జూలై 24(నమస్తే తెలంగాణ): పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టగానే మాట తప్పడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అమలుకంటే రుణమాఫీ వడపోతపైనే రేవంత్ సర్కార్ ఎక్కువగా దృష్టిపెట్టిందని, రేషన్‌కార్డు, పీఎం కిసాన్ నిబంధనల పేరుతో తక్కువ మొత్తంలో రైతులకు రుణమా ఫీ అయ్యేలా జాగ్రత్త పడిందని రైతులు, రైతు సం ఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రుణమాఫీపై రైతుల్లో ఇంకా సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో తెలుసుకునేందుకు రైతులు బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
తమకు పంటరుణమాఫీ అయ్యిందా లేదా? అసలు, వడ్డీ కలిసి ఎంతరుణం ఉంది?ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ డేట్‌లోపే రుణం చెల్లించినా ఎందుకు రుణమాఫీ కాలే దు? పంటరుణం రీషెడ్యూల్ చేసుకున్నా ఎందుకు మాఫీ కాలేదు? తదితర ఫిర్యాదులతో రైతులు ప్రతిరోజు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లను కలుస్తున్నారు. బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు ఏమి సమాధానం చెప్పలేక తదుపరి జాబితా లో మీపేరు ఉంటుందని రైతులకు నచ్చజెప్పి పంపుతున్నారు. దీంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. రుణమాఫీ అమలు కాలేదంటూ ఫిర్యా దు చేస్తున్న రైతుల సంఖ్య రోజురోజకు పెరుగుతున్న ది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 300 మందికిపైగా రైతులు రుణమాఫీ కాలేదంటూ అధికారులు, బ్యాంకర్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తు న్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది.
ఇంకా జమకాని రుణమాఫీ డబ్బులు…
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ డేట్లో రూ.లక్ష లోపు రుణం తీసుకున్నవారి సంఖ్య 1.50 లక్షల మందికిపైగా ఉంటారు. జిల్లాలో మొ త్తం 51167 మంది రైతులకు రూ.279.60 కోట్ల రుణం మాఫీ అయ్యింది. ప్రభుత్వం 50,555 మం ది రైతులు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేసిం ది. ఇంకా 612 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. జాబితాలో తమపేరు ఉన్నప్పటికీ ఇం కా రుణమాఫీ డబ్బులు జమకాకపోవటం పై 612 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
డీసీసీబీలో సగం మందికే రుణమాఫీ…
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్న రైతులకు వందశాతం రుణమాఫీ కాలేదు. సంగారెడ్డి జిల్లాలో డీసీసీబీ పరిధిలో 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందు లో 37 సంఘాలు డీసీసీబీ పరిధిలో ఉండగా, 16 బ్యాంకులు ఎస్బీఐ పరిధిలో ఉన్నాయి. డీసీసీబీ పరిధిలోని 37 పీఏసీఎస్‌లలోని 13,269 మంది రైతు లు లక్ష రూపాయల్లోపు రూ.56.01 కోట్ల పంటరుణాలు తీసుకున్నారు. కాగా, ప్రభుత్వం 6090 మం ది రైతులకు మాత్రమే రూ.25.13 కోట్ల మేర పంటరుణాలు మాఫీ చేసింది.
మిగతా 7179 మంది రైతులు ప్రభుత్వం తమ పంటరుణాలు మాఫీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకు పరిధిలో ఉన్న 16 పీఏసీఎస్‌లు సీడెడ్ బ్యాంకులుగా ఉన్నాయి. 16 సీడెడ్ బ్యాంకుల పరిధిలో 8వేల మందిరైతులు సభ్యులుగా ఉన్నారు. 2017 వరకు సీడెడ్ సొసైటీల్లోని రైతులు లక్షల నుం చి రూ.2 లక్షల పంటరుణాలు తీసుకున్నారు. ప్రభు త్వం రుణమాఫీకి ప్రకటించిన కటాఫ్ డేట్లో సీడెడ్ సొసైటీ సభ్యులు రావడం లేదు. దీంతో సీడెడ్ బ్యాం కుల్లో పంటరుణం తీసుకున్న రైతులు తమకు పంటరుణం వర్తింపజేయాలని కోరుతున్నారు.
పంట రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలి
సిద్దిపేట, జూలై 24: లక్ష పంట రుణమాఫీ అయిన రైతులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరులోపు కొత్త రుణాలు అందజేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవా రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐని ఆయన సందర్శించారు. పంట రుణమాఫీ రీషెడ్యూల్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పంట రుణమాఫీ అమలు చేస్తున్నదన్నారు. లక్ష పంట రుణమాఫీ కాని రైతుల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి బ్యాంకులో ఎంక్వయిరీ సెంటర్ ఏర్పాటు చేసి వ్యవసాయాధికారుల సమన్వయంతో సమస్యలు పరిషరించాలన్నారు. ప్రతి బ్యాంకులో రోజూ 100 మంది రైతుల పంటరుణాలు రెన్యూవల్ చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబును ఆదేశించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ వికాస్, మేనేజర్ సురేశ్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ జయంత్, మేనేజర్ సుధీర్, బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంట రుణమాఫీ బృహత్తర కార్యక్రమం
మెదక్, జూలై 24 (నమస్తే తెలంగాణ): పంట రుణమాఫీ బృహత్తర కార్యక్రమమని, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో రుణమాఫీపై వ్యవసాయ, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా కోఆపరేటివ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 47,616, మంది రైతులకు రూ.లక్షలోపు రూ.237.50 కోట్ల పంటరుణమాఫీ జరిగిందన్నారు.
క్షేత్రస్థాయిలో పంటరుణమాఫీపై వచ్చే సమస్యలను ఎప్పటికప్పు డు నివృత్తి చేసుకొని పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ భూమి ఉండి పంటరుణం తీసుకున్న ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తిస్తుందన్నారు. ఎవరికైనా పంటరుణమాఫీ కాకుంటే మండల లేదా జిల్లా వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. పంటరుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిషరించాలని ఆదేశించారు. మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి కరుణ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

