గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై రూట్ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారులను శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
- కలెక్టర్ ఎం.మను చౌదరి
సిద్దిపేట అర్బన్, జూన్ 7 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై రూట్ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారులను శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ఉన్నందున శనివారం ఉదయంలోగా 21 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
డిపార్ట్మెంట్ అధికారులు అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రక్షణ ఏర్పాట్లు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించి చీఫ్ సూపరిండెంటెండ్‌కు తగు సూచనలు ఇవ్వాలన్నారు. పరీక్ష జరిగే రోజు ఉదయం 5.30 గంటలకే పరీక్ష మెటీరియల్ ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లి పరీక్ష సామగ్రిని పైలట్, ఎస్కార్ట్ వాహనాలతో గట్టి పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరిండెంటెండ్లకు అందించాలన్నారు.
జిల్లాలో మొత్తం 8,223 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా వారిలో 13 మంది అంధ దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారని వారికి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివిన వారిని సహాయకులుగా నియమించి పరీక్ష రాయాలన్నారు. పరీక్ష సమయం పూర్తయ్యేలోగా పరీక్షా కేంద్రం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేదని.. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

