బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా జనం ఉరకలై సాగుతారు. గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘ఆత్మీయ సమ్మేళనాలకు ఊరూవాడా కదలివస్తున్నారు. సీఎం కేసీఆర్ మా పెద్ద కొడుకంటూ ముసలి వారు సైతం ఉత్సాహంగా సభలకు వస్తుండడంతో కారు పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నది.
జిన్నారం, మార్చి 27: ‘కార్యకర్తలే నా బలం, ప్రజలే నా బలగం.. మీ సలహాలు, సూచనలు ఎప్పటికీ కావాలి. మీరిస్తున్న ధైర్యంతోనే పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంతంగా తీర్చిదిద్దుతున్నాను’ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండల ఆత్మీమ సమ్మేళనాన్ని గడ్డపోతారంలోని పులిగిల్ల ఫంక్షన్హాల్లో నిర్వహించారు. జిన్నారం గిరిజన గురుకుల పాఠశాల చౌరస్తా నుంచి గడ్డపోతారం ఫంక్షన్‌హాల్ వరకు దాదాపు పదిహేను వందల బైకులతో నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ఫంక్షన్‌హాల్ వద్ద బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్థానిక శివాలయంలో పూజలు చేసి, అమరవీరులను స్మరిస్తూ చిత్రపటానికి నివాళులర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఆత్మీయ సమ్మేళనానికి అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు అభిమానులతో పాటు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మీద అభిమానంతో వృద్ధులు, యువకులు హాజరయ్యారు. గడ్డపోతారం సర్పంచ్ ప్రకాశ్‌చారి గ్రామ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యేకు పుష్పాభిషేకం చేశారు. గ్రామాల వారీగా కార్యకర్తలు ఎమ్మెల్యేను సన్మానించి శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్‌లు ప్రకాశ్‌చారి, చిట్ల సత్యనారాయణ, ఆంజనేయులు, ఖదీర్, జనార్దన్, లావణ్యజీవన్, రేఖాకృష్ణ, వెంకటయ్య, ఎంపీటీసీ సంతోషమహేశ్, వావిలాల పీఏసీఎస్ చైర్మన్ శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేందర్‌గౌడ్, రవీందర్, శివరాజ్, వెంకట్రాంరెడ్డి, గోవిందరాజు, నీరుడి శ్రీనివాస్, పూజారిరాజు, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవ, గోవర్దన్‌రెడ్డి, నాగరాజు, మమతపెంటేశ్, మల్లేశ్, నాయకులు ఆకుల నవీన్‌కుమార్, నరేందర్, శంకరప్ప, ప్రభాకర్‌రెడ్డి, అశోక్‌కుమార్, సురేందర్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, ఆలయ, పీఏసీఎస్ డైరెక్టర్లు, కార్యకర్తలు అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
వంద సీట్లు గెలుస్తాం..
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రాబోయే ఎన్నికల్లో వందకు వంద సీట్లు బీఆర్ఎస్వే, కేసీఆరే సీఎం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, పటాన్చెరు నియోజకవర్గం ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలే. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న తరువాత ఇప్పుడెలా ఉందో అందరూ ఆలోచించాలి అన్నారు. సాగుకు, తాగుకు, పరిశ్రమలకు 24గంటల కరెంటు వస్తున్నదని, అప్పుడు కరెంటు అడిగితే కాల్చి చంపిర్రు. దేశంలోనే 24గంటల కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రులు లేరు, మన ప్రాంతంలో అలాంటి పరిస్థితులు లేవు. వందల కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నీరు తెచ్చి ఇంటింటికీ సరఫరా చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్నో పథకాలు ఇప్పుడు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. ఓ పద్ధతి, జెండా, ఎజెండా లేని బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలను ఎవ్వరూ పట్టిచ్చుకోరన్నారు. చదువుకున్న వారికి సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మీతో మాట్లాడడం సంతోషంగా ఉందని, అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఒక్కసారి సర్పంచ్‌గా పని చేసిన వాళ్లు ఎమ్మెల్యే అవుతారా..
– సంగారెడ్డి జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్
యువకులను బిచ్చగాళ్లుగా మారుస్తూ వెంట తిప్పుకునే లీడర్లు వస్తున్నారని, డబ్బులు చల్లుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని, దయచేసి అలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ అన్నారు. ఒక్కసారి సర్పంచ్‌గా ప ని చేస్తే ఎమ్మెల్యే అవుతారా..? ప్రజలు ఆలోచించాలే. నేను సర్పంచ్‌గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా పని చేసిన నేను ఎమ్మెల్యే అవుతానా. ఎమ్మెల్యే అయ్యేవారే అవుతారని, ఆరోగ్యంగా, ఓపిక ఉన్నన్ని రోజులు గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతారని, మనకోసం పనిచేసే వారిని కాపాడుకోవాలన్నారు. ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు తిరుగుతూనే ఉండే ఎమ్మెల్యే ఆయన అని కొనియాడారు.
నేను ఉన్నన్ని రోజులు కారు గుర్తుకే ఓటేస్తా
నాకు సీఎం కేసీఆర్ సార్ అంటే ఇష్టం. నేను పది ఏండ్ల నుంచి ఇసొంటి వాటికి వస్తుంట. మా ఊర్ల ఏం ముఖ్యమైంది చేసిన నేను పోతా. అట్లనే మా ఊరునుంచి గడ్డపోతారం వచ్చిన. నా ఓటు కేసీఆర్ సార్‌కు, కారు గుర్తుకే. ఎమ్మెల్యే వెంటనే ఉంటా…బాజాప్తా పనిచేస్త.
– యాదయ్య, జంగంపేట
సీఎం కేసీఆర్ సారంటే ఇష్టం
నాకు సీఎం కేసీఆర్ సారంటే ఇష్టం. ఆయనొచ్చినంకే ఫించన్లు పెంచిండు. నెలనెలా ఇచ్చే ఆ పైసలతోనే ఎవ్వరికి ఆస పడకుండా బతుకుతున్న. ఎప్పుడు ఓట్లోచ్చిన కారు గుర్తుకే ఓటేస్తున్న. నేను ఉన్నన్ని రోజులు కారు గుర్తుకే ఓటేస్తా.
– సాయమ్మ, గడ్డపోతారం