రానున్న రోజులు బీఆర్ఎస్వే
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిర్గాపూర్‌లోని మల్లన్న స్వామి ఉత్సవాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిర్గాపూర్, నవంబర్ 30: ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిర్గాపూర్‌లోని మల్లన్న స్వామి ఉత్సవాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. యాదవ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఓటేసి గెలిపించాలన్నారు.
మరో రెండేండ్లు ఓపిక పడితే భవిష్యత్‌లో కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్లన్న స్వామి పేరునే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించినట్లు తెలిపారు. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని, స్థానిక మల్లన్న స్వామి ఆశీస్సులతో ఇక్కడి ప్రజలకు అంతా మేలు జరగాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక మల్లన్నసాగర్ ద్వారా నీళ్లుతెచ్చి నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు పాటిల్, రవీందర్‌నాయక్, పరమేశ్వర్,యాదవ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

