అసౌకర్యాలకు నిలయం వసతి గృహం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వెనుకబడిన కులాల విద్యార్థుల వసతిగృహం అసౌకర్యాలకు నిలయంగా మారింది. ప్రీమెట్రిక్ స్థాయిలో పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
హుస్నాబాద్, జూలై 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వెనుకబడిన కులాల విద్యార్థుల వసతిగృహం అసౌకర్యాలకు నిలయంగా మారింది. ప్రీమెట్రిక్ స్థాయిలో పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ అద్దె భవనంలో నడుస్తున్న ఈ హాస్టల్లోప్రస్తుతం 80 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు నిత్యం ఇరుకు గదులు, రేకులషెడ్లలో ఉండాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనం లేక శాపంగా మారింది.
మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులే కావడం వల్ల రేకులషెడ్లలో నిద్రించేందుకు ఇబ్బందులు పడుతున్నా రు. సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ భవనాన్ని పోస్ట్ మెట్రిక్ (కళాశాల స్థాయి విద్యార్థులు) విభాగానికి అప్పగించి చిన్నపిల్లలు ఉండే ప్రీమెట్రిక్ హాస్టల్‌ను మాత్రం ఎలాంటి సౌకర్యంలేని ప్రైవేట్ భవనంలోకి మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు కూడా లేవు.
ఇరుకు గదుల్లోనే విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. అసౌకర్యాల భవనంతోపాటు ఇందులో చేరిన విద్యార్థులకు ఇప్పటి వరకు పుస్తకాలు, నోటుబు క్స్ పంపిణీ చేయలేదు. 2016 మెనూను (ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.31లు) ఇప్పటికీ అమలు చేస్తుండటం వల్ల పెరిగిన నిత్యావసర ధరలతో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన మెనూ చార్జీ ల జీవోజారీ చేయగా అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆజీవోను అమలు చేయడం లేదు. కాస్మొటిక్స్ బిల్లులు కూడా సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు కొరవడ్డాయి. కనీసం దుప్పట్లు పంపిణీ చేయలేదు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

