4న ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సీనియర్ జట్ల ఎంపిక
ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ బాలుర, బాలికల జిల్లా జట్లను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మిరుదొడ్డి మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ
మిరుదొడ్డి, డిసెంబర్ 1: ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ బాలుర, బాలికల జిల్లా జట్లను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మిరుదొడ్డి మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీవీ.రమణ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
4న సంకల్ప్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్ ఓల్డ్ ఎంఐజీ (బీహెచ్ఈఎల్ రామచంద్రపురం)లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు మూడు పాస్‌ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీని వెంట తీసుకు రావాలని తెలిపారు. జిల్లాలో ఎంపికైన జట్లు ఈ నెల 9 నుంచి 11వరకు గోదావరిఖని, పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే 68వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9440 703038 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

