నమస్తే తెలంగాణ, మెదక్ నెట్వర్క్: త్యాగానికి ప్రతీకైన బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లాలో ముస్లిములు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మత పెద్దలు ముస్లిములకు పలు సందేశాలను వినిపించారు. పలువురు ప్రముఖులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.