Chanti Kranthi Kiran | అందోల్ గడ్డ గులాబీ అడ్డా.. అభివృద్ధే ఎజెండాగా ప్రజల్లోకి: చంటి క్రాంతికిరణ్
Chanti Kranthi Kiran | అందోల్ గడ్డ గులాబీ అడ్డా అని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎం చేస్తామని పేర్కొన్నారు.
Chanti Kranthi Kiran | ‘అందోల్ గడ్డ.. గులాబీ అడ్డా.. ప్రజలు, కార్యకర్తలు, నాయకుల సహకారంతో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రెండో సారి అందోల్ నుంచి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రూ. 50కోట్లతో అందోల్-జోగిపేట మున్సిపాలిటీని తీర్చిదిద్దుతున్నామని, రూ.200కోట్లు కేవలం రోడ్ల నిర్మాణం కోసమే వెచ్చించామని తెలిపారు. రూ.36.17 కోట్లతో నిర్మించిన తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌తో 13వేల ఎకరాలు సస్యశ్యామలమయ్యాయన్నారు. అందోల్-జోగిపేటలో 1350 మంది లబ్ధిదారులకు డబుల్ బెడురూం ఇండ్లు అందజేశామన్నారు. దళితబంధుతో 100 కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయని, రూ. 3.80కోట్లతో కొత్తగా పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
– అందోల్, ఆగస్టు 28
అందోల్, ఆగస్టు 28: అందోల్ గడ్డ గులాబీ అడ్డా అని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎం చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకంతో జర్నలిస్టుగా ఉన్న తనకు 2018లో మొదటిసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో రెండోసారి మళ్లీ అవకాశం కల్పించారని తెలిపారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరోనాతో రెండేండ్ల సమయం వృథాగాపోయినా మిగిలిన సమయాన్ని వినియోగించుకుని అన్ని గ్రామాలు అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ సీఎం అయ్యాక జరిగిందన్నారు.
తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ సమప్రాధాన్యత నిచ్చారని, ఆయన బాటే నాకు తారకమంత్రమన్నారు. రూ. 50కోట్లతో అందోల్-జోగిపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని, రూ.200కోట్లు కేవలం రోడ్ల నిర్మాణం కోసమే వెచ్చించామని, ఇప్పుడు మరిన్ని నిధులతో పాడైపోయిన రోడ్ల నిర్మాణం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. మనఊరు-మనబడి, రైతువేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె, పట్టణ ప్రకృతివనాలు, తాలెల్మ ఎత్తిపోతల, బసవేశ్వర-సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఎన్నికల బరిలో అన్ని పార్టీలకంటే ముందున్నామని, పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోతూ గత మెజార్టీకంటే రెట్టింపు సాధిస్తామన్నారు. చేసిన పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. అన్ని వర్గాలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేవన్నారు. రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన సందర్భంగా నమస్తేతెలంగాణతో మాట్లాడారు.
నమస్తే: రెండోసారి టికెట్ రావడం ఎలా అనిపించింది..?
ఎమ్మెల్యే చంటి: జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం, ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మొదటిసారి 2018లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. దానిని సద్వినియోగం చేసుకుని మంత్రులు, నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొంది నా పదవికి పూర్తిగా న్యాయం చేశాను. నా పనితీరు నచ్చడంతో సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది… టికెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల అండదండలతో మళ్లీ గెలుస్తాననే నమ్మకం ఉంది.
నమస్తే: మొదటిసారి ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు..?
ఎమ్మెల్యే చంటి: గెలిచిన నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించాం. రెండేండ్లు పూర్తిగా కరోనాతో గడిచిపోయింది. అయినా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటూలో ఉంటూ అన్ని రకాలుగా సహాయ,సహకరాలు అందించాం. తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడంతో రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. సంగమేశ్వర-బసవేశ్వర పనులు జరుగుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొత్త రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీకి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు, జీపీలకు ప్రత్యేక నిధులు ఇలా కొన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ. 250 కోట్ల్లు ఖర్చుచేశాం. రూ.2.80 కోట్ల ప్రత్యేక నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, రూ.36.17 కోట్లతో నిర్మించిన తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌తో 13వేల ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. అందోల్-జోగిపేటలో 1350 మంది లబ్ధిదారులకు డబుల్ బెడురూం ఇండ్లు అందజేయడంతో వారు సంతోషంగా ఉన్నారు. దళితబంధుతో 100 కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. దళితబంధు ద్వారా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో 50 కుటుంబాలు, టేక్మాల్ మండలం అసద్మహ్మద్పల్లిలో 50 కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10లక్షలు అందజేయగా వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. మనఊరు-మనబడితో మెరుగుపడిన పాఠశాలలు, గల గలాపారుతున్న సింగూర్ కాలువులు కోనసీమను తలపిస్తున్నాయి. రూ.3.80 కోట్లతో పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపడుతూ ఘణనీయమైన అభవృద్ధిని సాధించాం.
నమస్తే: మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు..?
ఎమ్మెల్యే చంటి: ఇప్పటివరకు మున్సిపల్ నిధులతోపాటు సీఎం మొదటివిడుతలో విడుదల చేసిన రూ.25 కోట్ల ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేశాం. 2.5 కోట్లతో నిర్మిస్తున్న మున్సిపల్ భవనం నిర్మాణంలో ఉంది. పట్టణ ప్రగతిలో అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. రూ.1.6 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో ఆటోలు, ట్రాక్టర్లు, డ్రైనేజీ క్ల్లీనర్ కొనుగోలు చేసి పారిశుధ్య పనులు చేపడు తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. టీఎఫ్ఐడీసీ నుంచి మొదటి విడతలో రూ.9.60 రెండో విడతలో రూ.9.70 కోట్లు నిధులు మం జురు కాగా ప్రజలకు అవసరమయ్యే మౌలికవసతులు కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు మధ్యలో డివైడర్లు నిర్మాణం చేపట్టి మొక్కలు నాటి లైట్లు ఏర్పాటు చేశాం. ఎంతో చరిత్ర కలిగిన క్లాక్‌టవర్ తగిన మరమ్మతులు లేక పాడైపోయే స్థితికి చేరడంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చాం.మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లలకు పార్కు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్రధాన రహదారి నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా సీసీ డ్రైనేజీ ఇలా అన్ని రకాలుగా నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం.
నమస్తే: ఇతర పార్టీల అభ్యర్థులు, మీకు మధ్య తేడా ఏమిటి..?
ఎమ్మెల్యే చంటి: ఇతర పార్టీల అభ్యర్థులెవ్వరూ స్థానికులు కాదు. స్థానిక ప్రజల సమస్యలు, అవసరాలు వారికి తెలియదు. ఎలాంటి ఆపదొచ్చినా, ఆఖరుకు కరో నా సమయంలో వారు ప్రజలకు అందుబాటులో లేరు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఊర్ల మీదపడి తిరుగుతున్నారు. కానీ నేను అలా కాదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నేటివరకు నిద్రలేచింది మొదటు పడుకునే వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న. పోతులబొగుడ, అందోల్ రెండుచోట్ల ఏదో ఒక చోటా అందుబాటులో ఉండి వారి సమస్యలు వింటూ పరిష్కరిస్తున్న. అనునిత్యం అండగా ఉండే స్థానికులనే ప్రజలు కోరుకుంటున్నారు. స్థానికేతరులకు అందోల్‌లో చోటులేదు…ఇక్కడి ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి ఆత్మగౌరవం, అభివృద్ధి రెండూ కావాలి. ఆ రెండు కేవలం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమని గుర్తించారు. అందుకే ఘన విజయం అందించారు. మరోసారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
నమస్తే: రెండోసారి మీ అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఫీలవుతున్నారు..?
ఎమ్మెల్యే చంటి: మళ్లీ తనకే ఎమ్మెల్యే టికెట్ రావాలని బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కోరుకున్నది. వారు కోరుకునట్టే టికెట్ రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొందరు అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. దానిని ఎలా అధిగమించాలనే దానిపై కూడా దృష్టి పెడుతున్నాం. కొంతమంది నాయకులతో నేను, పార్టీ పెద్దలు చాలాసార్లు మాట్లాడినా మార్పు రావడం లేదు. వీరంతా అసంతృప్తి ముసుగులో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులు. మనం చేసే పనులు అందరికీ నచ్చాలని లేదు. ఏదైన అభివృద్ధి చేస్తే కొంతమంది వాళ్లకు ఉపయోగకరంగా చేయాలి అంటారు. కానీ దానిని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తాం. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయి నా అందరితో మాట్లాడుతున్నాం. పార్టీ కోసం కలిసి పని చేసేలా కృషి చేస్తున్నాం.
నమస్తే: రెండోసారి గెలిచిన తర్వాత ప్రజలకు ఎం చేయబోతున్నారు..?
ఎమ్మెల్యే చంటి: మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు, పార్టీ నాయకులు, ప్రజల సహకారంతో మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని 208 గ్రామాలను ఎంతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేశాం. గతంలో ఏ గ్రామానికి వెళ్లినా సరైన రోడ్లు ఉండేవి కావు, డ్రైజేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం ఏర్పడింది. డైనేజీ సమస్య తీరింది. గల్లీల్లో సైతం సీసీ రోడ్డు ఏర్పడ్డాయి.ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా. సీఎం కేసీఆర్, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతా.
నమస్తే: ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది..?
ఎమ్మెల్యే చంటి: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి చాలామంచి రెస్సాన్స్ వస్తున్నది. అందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారిన దగ్గరి నుంచి ఇప్పటీ వరకు స్థానికేతరులు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రులుగా పనిచేశారు. కానీ ఇక్కడి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారు. దీంతో ఇక్కడి ప్రజల్లో స్థానిక నినాదం బలంగా నాటుకుపోయింది. 2018లో స్థానిక నినాదం తీవ్ర రూపందాల్చి అందరూ ఏకతాటిపైకొచ్చి భారీ మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి కూడా అందరి సహకారంతో గెలుపే లక్ష్యంగా, ప్రజలు, పార్టీ శ్రేణులను కలుపుకొని ఎన్నికల సంగ్రామంలోకి దిగబోతున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలే మా ప్రచారస్ర్తాలు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇలా ప్రజారంజకమైన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతాం.
నమస్తే: ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు..?
ఎమ్మెల్యే చంటి: మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీల కంటే ముం దే ఎన్నికల బరిలో ముందున్నాం. పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, ప్రజలను కలుపుకుపోతూ ఎన్నికల సమరభేరి మోగించను న్నాం. అన్ని గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ..ఇలా అన్ని కమిటీలను ఏర్పాటు చేశాం. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని సీఎంకు కానుకగా ఇస్తాం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

