బదిలీలకు వేళాయె
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఒకే పాఠశాలలో రెండేండ్లు పనిచేసిన వారిని కనీస అర్హతగా నిర్ణయించారు.
- ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
- మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేసిన హైకోర్టు
- రేపటి నుంచి ప్రక్రియ షురూ
- పారదర్శకంగా చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు
- బదిలీలకు కనీస అర్హత రెండేండ్లు
- మెదక్ జిల్లాలో 3,990 మంది ఉపాధ్యాయులు, 637 పోస్టులు ఖాళీ
- సంగారెడ్డి జిల్లాలో 4వేల మందికిపైగా స్థాన చలనం, 300 మందికి ఉద్యోగోన్నతులు లభించే అవకాశం
- సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఒకే పాఠశాలలో రెండేండ్లు పనిచేసిన వారిని కనీస అర్హతగా నిర్ణయించారు. ఒకే చోట ఐదేండ్లు విధులు నిర్వర్తించిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఇందుకుసంబంధించి త్వరలో ప్రభుత్వం విధివిధానాలతో షెడ్యూల్ విడుదల చేయనుండగా, మెదక్, సంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఎక్కడ, ఎన్ని ఖాళీలున్నాయి.. ఉద్యోగోన్నతులకు ఎంత మంది అర్హులున్నారు తదితర వివరాలను సేకరిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించనున్న బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) / మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 1
సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 1 : ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయనుండగా, వచ్చేనెల 3వ తేదీ వరకు ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్న తుల ప్రక్రియ ముగియనున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలో సెప్టెంబర్ 1 నాటికి రెండేండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పాఠశాలలో ఐదేండ్ల కాలం పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఇందులో భాగంగా వారు పనిచేస్తున స్థానాలను బదిలీల జాబితాలో చేర్చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీల షెడ్యూల్ విడుదల చేస్తుండటంతో విద్యాశాఖ అధికారులు బదిలీలపై కసరత్తులు ప్రారంభించారు. ఆయా వివరాలను విద్యాశాఖ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
చాలా సంతోషంగా ఉంది
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని సుమారు 400 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులతో పాటు సుమారు 3వేల మంది ఉపాధ్యాయులకు పైగా బదిలీల వలన లబ్ధి పొందే అవకాశమున్నది. 5 ఏండ్ల తర్వాత బదిలీలు, 8 ఏండ్ల తర్వాత పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా దంపతులకు అదనంగా 10 పాయింట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై భార్యాభర్తలకు ఒకే దగ్గర పనిచేసే అవకాశమున్నది.
– మల్లారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
పారదర్శకంగా ఉండాలి..
ఉపాధ్యాయ బదిలీలకు న్యాయస్థానం అనుమతివ్వడం సంతోషకరం. 8 ఏండ్ల తర్వాత చేపట్టబోయే బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి. విద్యాశాఖ వెంటనే బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి. బదిలీల కటాప్ తేదీని సెప్టెంబర్ 1 వరకు పరిగణలోకి తీసుకోవాలి.
– సిద్దిరాములు, ఉపాధ్యాయుడు, మెదక్
మెదక్ జిల్లాలో 3,990 మంది ఉపాధ్యాయులు
మెదక్ జిల్లాలో 3,363 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, మరో 627 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరిలో బదిలీల కోసం 3216 మంది దరఖాస్తులు చేసుకోగా, ప్రస్తుతం ఈ సంఖ్య పెరుగనున్నది. ప్రభుత్వం మొదట గజిటెడ్ హెచ్ఎంల బదిలీలు చేపట్టనున్నది. తరువాత స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నది. మిగిలిన ఎస్‌ఏలకు బదిలీలు చేపడుతున్నది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నది. మిగిలి వారికి బదిలీలు చేపడుతున్నది. తరువాత మిగిలిన పోస్టులకు టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తారు.
సంగారెడ్డి జిల్లాలో 4వేల మందికిపైగా స్థానచలనం..
సంగారెడ్డి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఉద్యోగోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగటంతో ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 300 మందికిపైగా ఉద్యోగోన్నతులు లభించే అవకాశమున్నది. ప్రస్తుతం ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 70 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండగా, ఉద్యోగోన్నతులతో భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు 200 మందికిపైగా పదోన్నతులు లభించే అవకాశం ఉండగా, ఖాళీగా ఉన్న పోస్టులను అనుసరించి ఉద్యోగోన్నతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. బదిలీలకు సంబంధించి 4వేల మందికిపైగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనున్నది. బదిలీల కోసం జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిబ్రవరిలో 3600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు తాజాగా మరో 700 మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. దీంతో 4వేల మందికిపైగా ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీలు కానున్నారు. రెండేండ్లకుపై సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు బదిలీల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే బదిలీ అయ్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగోన్నతులు, బదిలీలకు చర్యలు తీసుకుని షెడ్యూల్ విడుదల చేస్తుండటంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
సంగారెడ్డి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతులు, బదిలీల కోసం ఎంతోకాలం గా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుల కలను నెరవేరుస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగోన్నతులు, బదిలీలపై షెడ్యూల్ విడుదల చేయనుండటం సంతోషంగా ఉంది. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ఆన్లైన్లో ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులను ఉపాధ్యాయుల తరఫున కోరుతున్నాం. ఈ ప్రక్రియకు సహకరించిన మంత్రి సబితారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డికి కృతజ్ఞతలు.
– గుండు లక్ష్మణ్, పీఆర్టీయూటీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టనుండటంతో ఉపాధ్యాయు లు సంతోషంగా ఉన్నా రు. ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. జిల్లాలో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని కోరుతున్నాను. ఈ ప్రక్రియకు సహకరించిన మంత్రి సబితారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు.
– సయ్యద్ సాబేర్ అలీ, ఎస్టీయూటీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

