నిండుకుండలా మల్లన్నసాగర్
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు.
తొగుట, సెప్టెంబర్ 21: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు.
మల్లన్నసాగర్ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ఇంతకు ముందున్న 8.50 టీఎంసీల నీటికి అదనంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13.00 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ఆయన తెలిపారు. 2020లో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో తొలిసారిగా పంపింగ్ ప్రారంచామని, నాలుగేండ్లలో ఇప్పటివరకు మొత్తం 60.40 టీఎంసీల నీటిని ఎత్తిపోశామన్నారు. 12వ ప్యాకేజీలో దుబ్బాక కాలువ ద్వారా నాలుగేండ్లుగా గొలుసుకట్టు చెరువుల ద్వారా 95 చొప్పున ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లు నింపి మొత్తం 7.45 టీఎంసీల నీటిని సరఫరా చేసినట్లు చెప్పారు.
దుబ్బాక ప్రధాన కాలువ 46.675 కి.మీ పొడువు కలిగి ఉండి 16 డిస్ట్టిబ్యూటరీల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని, వీటి మొత్తం పొడ వు 103 కి.మీ అన్నారు. 12వ ప్యాకేజీలో సిద్దిపేట సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లోని 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు రూపొందించబడిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల సహకారంతో డిస్టిబ్యూటరీ కాలువల పూర్తికి అవసరమైన భూసేకరణ చేపట్టి పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి కృషిచేస్తామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

