గురువారం 04 జూన్ 2020
Mancherial - Jan 12, 2020 , 02:56:35

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

చెన్నూర్‌, సమస్తే తెలంగాణ : చెన్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గోగు దేవక్కకు రూ11,000, అనపర్తి సమ్మక్కకు రూ8,500 సీఎం సహాయ నిధి చెక్కులను వారు పంపిణీ చేశారు. 
కోటపల్లి : కోటపల్లి మండల నక్కలపల్లి గ్రామానికి చెందిన పుష్పలతకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.18వేలు విలువ చేసే చెక్కును వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాస్‌ రావ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బైస ప్రభాకర్‌ అందించారు. పుష్పలత అనారోగ్యానికి గురికాగా ఈ విషయాన్ని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ల దృష్టికి తీసుకుపోవడంతో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.18వేలు మంజూరు చేయించినట్లు తెలిపారు. నాయకులు ముల్కల్ల శశిపాల్‌ రెడ్డి, సాంబాగౌడ్‌, మధనమోహన్‌ రెడ్డి, కంకణాల సంపత్‌ రెడ్డి పాల్గొన్నారు.


logo