అమ్రాబాద్, అక్టోబర్ 1 : నేటి నుం చి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు లో వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్‌గోపిడి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ అచ్చంపేట, కొల్లాపూర్, నాగార్జునసాగర్ వరకు విస్తరించి ఉన్న ఈ అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అ భయారణ్యంలో కృష్ణానది ప్రవాహం, వన్యప్రాణులు, శ్రీశైలక్షేత్రం, ఆక్టోపస్, మల్లెలతీ ర్థం, లొద్ది, సలేశ్వరం తదితర చూడదగిన ప్ర దేశాలతో నల్లమల విరాజిల్లుతుందని చె ప్పారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఐదు రోజులు విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, ఇతర పోటీలు నిర్వహిస్తామని, నిత్యజీవితంలో అడవుల ఆవశ్యకత, జంతువుల సంరక్షణ, వన్యప్రాణుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అడవిలో అధికారులు చేపడుతున్న సంరక్షణ చర్యలతో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది అధికారుల నివేదిక మేరకు పులుల సంఖ్య 34కు చేరిందని వివరించారు. మన్ననూర్ నుంచి శ్రీశైలం పాతాళగంగ వరకు ప్లాస్టిక్‌ను నిషేధించామని, ఇం దుకు యాత్రికులు, పర్యాటకులు సహకరించడం సంతోషకరంగా ఉందన్నారు.