లింగాల : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కామ్రేడ్ సుందరయ్య (Comrade Sundarayya ) స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం (CPM) జిల్లా నాయకులు శంకర్ నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని రాయవరం గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించి సీపీఎం జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ ( Shanker Naik) మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుకు భూమి లేకుండా , గిట్టుబాటు ధర కల్పించకుండా, మార్కెట్ వ్యవస్థ లేకుండాచేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఆందోళన పోరాటాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు స్వామి, కార్మిక సంఘం నాయకులు మల్లయ్య, శరమంద లక్ష్మయ్య, సభ్యులు పాల్గొన్నారు.
A