మరికల్ : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి (MLA Chittem Parnika reddy) అన్నారు. శుక్రవారం మరికల్ మండలంలోని తీలేరు పంప్ హౌస్ (Teelair Pump House) నుంచి కోయిల్ సాగర్‌కు(Koilsagar ) నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు 315 క్యూసెక్కుల నీటిని తీలేరు పంప్ హౌస్ నుంచి కోయిల్ సాగర్‌కు విడుదల చేస్తున్నట్లు వివరించారు. గొలుసుకట్టు కాలువల ద్వారా చెరువులను నింపుతామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే కోయిల్ సాగర్‌కు నీరుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కోయిల్ సాగర్ నీటి విడుదల చేయడం పట్ల ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ధన్వాడ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల అధ్యక్షుడు వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, కృష్ణయ్య, హర్షవర్ధన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, మంగలి రఘు, మల్లారెడ్డి, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, సత్యనారాయణ, జనార్దన్, రామన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.