రేపు టెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు
- 2,683 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 90,240 మంది అభ్యర్థులు
- కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
వనపర్తి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఐదు జిల్లా ల నుంచి టెట్ పరీక్ష కోసం భారీగా దరఖాస్తులు వచ్చా యి. 90,240 మంది పరీక్ష రాసేందుకుగానూ 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పేపర్-1 పరీక్షకు 18,923 మంది.. పేపర్-2కు 13,719, వనపర్తి జిల్లా నుంచి పేపర్-1కు 9,028, పేపర్-2 కు 6,634, నారాయణపేట జిల్లా నుంచి పేపర్-1కు 5,822, పేపర్-2కు 3,831, నాగర్‌కర్నూల్ జిల్లాలో పేపర్-1కు 11,216, రెండవ పేపర్ కోసం 8,495, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పేపర్-1కు 7,654 , పేపర్-2కు 4,920 మంది హాజరు కానున్నారు. హాల్‌టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
నిమిషం నిబంధన అమలు..
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1ను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం ఉండాలి. అలా లేకుంటే గెజిటెడ్ అధికారి ఎండార్స్ చేసిన కాపీ సమర్పిస్తేనే పరీక్షకు అనుమతించనున్నారు.
సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చికిత్సకు అవసరమైన సామగ్రి, మందులతో సిద్ధంగా ఉంటారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను సర్కార్ ఆదేశించింది.
పకడ్బందీగా ఏర్పాట్లు..
టెట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు చేశాం. పూర్తిస్థాయి పారదర్శకత కోసం సీసీ కెమెరాల నిఘాలో చీఫ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారుల సమక్షంలో ప్రశ్నాపత్రాల ను సీల్ తీస్తారు. జవాబు పత్రాలను ప్యాక్ చేస్తారు. వీడియో తోపాటు ఆడియో రికార్డు కూ డా అవుతుంది. ఇన్విజిలెటర్లుగా నాన్ టీచింగ్ సిబ్బందిని నియమిస్తాం. ఆన్సర్‌షీట్‌లో బబ్లింగ్ కోసం బ్లాక్ కలర్ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఆర్టీసీ శాఖ వారు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. టెట్ స్పెషల్ అని బోర్డులు లేదా స్టిక్కర్లు అతికించిన బస్సులను అన్ని రూట్లతో నడుపుతారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 9848369948, 9603677860ను సంప్రదించాలి.
– ఏ.రవీందర్, డీఈవో, వనపర్తి
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

