Minister Niranjan reddy | దేవుడి గుళ్లో ప్రసాదమా ఇవ్వడానికి .. ప్రతిపక్షాలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
Minister Niranjan reddy | ‘ బీఆర్ఎస్కు రెండు సార్లు అధికారం ఇచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు (Opposition parties) కోరుతున్నాయి.
వనపర్తి : ‘ బీఆర్ఎస్కు రెండు సార్లు అధికారం ఇచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు (Opposition parties) కోరుతున్నాయి. ఇది ఏమైనా దేవుని గుళ్లో ప్రసాదమా ఇవ్వడానికి. పనిచేసే ప్రభుత్వానికి, సమర్ధవంత పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కే మూడోసారి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ దశ మారిందని పేర్కొన్నారు. తెలంగాణకు ముందు తరువాత మారిన జీవన పరిస్థితులు బేరీజును వేసుకుని మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు సూచించారు. సాగునీటికి(Irrigation) , కరెంట్‌కు డోకా లేదని, పంటకు ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ (BRS) దేనని అన్నారు. పంటలను కొని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడించారు.
50 ఏండ్ల పాలనలో ఎన్నడూ సాగునీళ్లు ఇవ్వని, ప్రజల వలసలును పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సింగోటం నుంచి కాలువ నిర్మాణానికి రూ.150 కోట్లతో పనులు నడుస్తున్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. పింఛన్లు, రైతుబంధు పెంచడం తో పాటు సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించి రూ. 400 లకే సిలిండర్, భూమి లేని వాళ్లకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా వర్తింపు పథకాలు అందజేస్తామని మంత్రి అన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

