విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు : ఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఊరేగింపులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జడ్చర్లలో విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఊరేగింపులకు అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. ర్యాలీల నిషేధంపై ప్రజలకు ముందస్తుగా ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు.
ఈ విషయంలో చట్టవిరుద్దంగా ప్రవర్తించేవారిపై జాతీయ విపత్తు చట్టం, ఎన్నికల నియమావళి చట్టం మేరకు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలను ఉల్లంఘించేవారిపై నిఘా పెట్టడానికిగానూ వీడియో కెమెరాలతో పాటుగా నిఘా బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

