మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ( Arya Vaishya Sangam) ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వాసవి మాతా జయంతిని ( Vasavi Mata Jayanti ) పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం అష్టోత్తర పూజా , కలశపూజ వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మరికల్ అధ్యక్షుడు సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు రమేష్ లతోపాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.