తడారిన తుంగభద్ర
తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీటి ప్రవాహం స్వల్పంగా ఉండేది.
- నదిలో కరువైన నీటిజాడ
- తేలిన రాళ్లు, ఇసుక మేటలు
- గొంతెండుతున్న నదీతీర ప్రాంతాల పల్లెలు
అయిజ, మే 14 : తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీటి ప్రవాహం స్వల్పంగా ఉండేది. ఈ ఏడాది ఎగువ నుంచి వరద అంతంత మాత్రంగానే రావడం తో అక్టోబర్, నవంబర్ నెలలోనే ప్రవాహం నిలిచిపోయింది. ప్రస్తుతం నదిలో చుక్క నీరు కనిపించని దుస్థితి. దీంతో తీర ప్రాంత పల్లెల్లో గొంతెండుతున్నది. నీళ్ల కోసం ఖాళీ బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల వద్దకు ప రుగులు పెడుతున్నారు. మరికొందరు బైక్‌లు, సైకిళ్లపై తాళ్లతో బిందెలు కట్టుకొని నీటిని తెచ్చుకుంటున్నారు.
తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. కొందరైతే నదిలో చెలిమెల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. తెలంగాణ-ఏపీ సరిహద్దులోని నది లో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి.. సుమారు 2 గంటల పా టు నీటిని తోడి తెచ్చుకుంటున్నారు. ప్రజలతోపాటు పశుపక్షాదులకు సైతం నీటి కోసం తండ్లాడుతున్నాయి. గతేడాది వేసవిలో కనీసం అక్కడక్కడ ఏర్పడిన గుంతల్లో నీరు ఉండేదని, కానీ ప్రస్తుతం చుక్క నీరు కనిపించడం లేదు. వ్యవసాయ బో రు బావుల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటి ఆశలన్నీ అడియాశలయ్యాయని రైతులు వాపోతున్నారు. కొన్నేళ్లుగా తుంగభద్ర నది పరిస్థితి ఇలా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గాకముందే తాగునీటికి తల్లడిల్లే పరిస్థితులు వచ్చాయని పలువురు అంటున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

