గద్వాల అర్బన్, జూలై 8 : తల్లిని హత్యచేసిన కొడుకుకు పదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమా నా విధిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.కుషా తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన కృష్ణజడ రాముడు, నాగమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో చిన్న కొడుకు ప్రేమ్‌రాజ్ ప్రేమ పెండ్లి చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అ యితే, మార్చి 26, 2023న రామాపురం చేరుకొని తల్లిదండ్రులను నగదు కావాలని వేధించా డు. తమ దగ్గర లేవని చెప్పినా వినకుండా ఏప్రి ల్ 7, 2023న తండ్రిపై గొడ్డలితో దాడి చేసేందు కు యత్నించగా.. అడ్డుగా వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా అక్కడకక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త రాముడు ఫిర్యాదు మేరకు శాంతినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ప్రేమ్‌రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలను పరిశోధించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఇరువర్గాల వాదనల అనంతరం నేరం రుజువుకావడంతో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కోర్టులో ట్రయల్ సమయంలో నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన ఏఎస్పీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ, శాంతినగర్ సీఐ రత్నం, అప్ప టి సీఐ శివశంకర్, అప్పటి ఎస్సై శ్రీనివాసులు, ప్రస్తుత ఎస్సై సంతోష్, పీపీ త్రిపాఠి, కోర్ట్ లైసెన్స్ హెడ్ కానిస్టేబుల్ పరమేశ్, గౌస్ఫీర్ను ఎస్పీ తోట శ్రీనివాసరావు అభినందించారు.