ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ మండలం పుల్జాల, మంతటి, వనపట్ల గ్రా మాల్లో పర్యటించారు.
- గుండెల మీద తన్నిన కాంగ్రెస్‌ను గడ్డపారలై పొడుద్దాం..
- వాళ్లొచ్చాకే నీళ్లు కనుమరుగాయే..
- రైతుల అవస్థలు వర్ణణాతీతం
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ మండలం పుల్జాల, మంతటి, వనపట్ల గ్రా మాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లా డుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కో రారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశామని, కాం గ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్‌తో కొంటామని చె ప్పి.. రైతులు రూ.1,800కే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓట్లకోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధిచెప్పడానికి మహిళలు చీపుర్లతో సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆడపిల్లల పెండ్లికి రేవంత్‌రెడ్డి ఎంతమందికి తు లం బంగారం ఇచ్చాడో చెప్పాలన్నారు. మన గుండెలమీద తన్నిన రేవంత్‌రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలన్నారు. సీఎంకు ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. దేవుళ్లపై ఒ ట్టు పెడుతూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఏఊరికెళ్తే ఆ ఊరి దేవుడిపై ఒట్టుపెట్టడం సీఎంకు పరిపాటిగా మారిందన్నారు. బీజేపీ పదేండ్ల పాలనలో ధరలు పెంచి గరీబోళ్ల నడ్డి విరిచిందన్నారు. ప్రశ్నించే గొంతులను గెలిపివ్వండని, కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తామన్నారు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు దిగిరావాలంటే ప్రవీణ్‌కుమార్‌ను పార్లమెంట్‌కు పంపాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పా ర్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

