పెద్దమందడి : పరీక్షలు పూర్తయిన సందర్భంగా వేసవి సెలవుల్లో (Summer Vacations ) విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు వివరించాలని పెద్ద మందడి ఎంఈవో బాణం విష్ణు ( MEO Vishnu ) ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో సోమవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరానికి ఎన్రోల్మెంట్( Enrollment ) పెంచే క్రమంలో నిర్వహించే బడిబాట గురించి వివరించారు. ఈనెల 23న చివరి పని దినంన విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రుల సమావేశంలో ఇవ్వాలని సూచించారు. వచ్చే వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఏ -2 పరీక్షల ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అప్డేట్ చేయాలని కోరారు. సమావేశంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ వర ప్రసాద్ రావు, మోజర్ల మద్దిగట్ల మంజులత, బలిజపల్లి శాంతన్న, పెద్దమందడి కాంప్లెక్స్ , ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.