నారాయణపేట టౌన్, నవంబర్ 23 : ప్రతిఒక్కరూ స న్మార్గంలో నడవాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నా రు. భగవాన్ సత్యసాయిబాబా జయంతి వేడుకలను పట్టణంలోని సత్యసాయి మందిరంలో బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత కం టి వైద్య శిబిరాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడా రు. భగవాన్ సత్యసాయి బాబా అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కంటి వైద్య శిబిరంలో 100 మందికి పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్స అవసరమున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతకు ముందు సత్యసాయి మందిరంలో నగర సంకీర్తన, ధ్వజారోహణం, సామూహిక వ్రతాలు, మహామంగళహార తి, స్వామి సందేశం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ, 10 0 మంది పేదలకు బట్టలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పో టీల్లో విజేతలుగా నిలిచిన వారికి అదనపు కలెక్టర్ పద్మజారాణి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సైప్లె అధికారి శి వప్రసాద్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ హాతిరాం నాయక్, జెడ్పీ సీఈవో జ్యోతి, స త్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ మాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు మల్లికార్జున్, సభ్యులు, వైద్యులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవకు పాటుపడాలి
ఊట్కూర్, నవంబర్ 23 : భగవాన్ స త్యసాయి బాబా జయంతి వేడుకలను బుధవారం మండలంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబా చిత్రపటానికి ప్ర త్యేక పూజలు చేసి భజనలు చేశారు. బాబా జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ దవాఖాన, అం గన్వాడీ కేంద్రాల్లో రోగులు, చిన్నారులకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లను పంపిణీ చేశారు. పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సమస్త మానవాళికి శాంతి, ప్రేమ, కరుణను పంచిన సత్యసాయి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ సమాజ సేవకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్‌గౌడ్, విశ్రాంత తాసిల్దార్ జయరాములు, టీఆర్ఎస్ యువజన విభాగం మండల కార్యద ర్శి తరుణ్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.