సర్పంచ్ గిరి.. కాస్ట్లీ గురూ..
స్థానిక సంస్థ ల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో పల్లెల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల మధ్య పోటీ పీక్ స్థాయికి చేరింది. నువ్వా.. నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఏకగ్రీవానికి రూ.కోటి వరకు వేలం పాటలు నిర్వహిస్తుండడంతో జోగు ళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మా రింది. అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పదవులు పొం దాలనే ఆలోచనతో పొందుపర్చిన రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కొందరు అపహస్యం చేస్తున్నారు.
- గద్వాల నియోజకవర్గంలో జోరుగా వేలం
- రెండో రోజూ కొనసాగిన మీటింగ్‌లు, ఎంపికలు
- ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తున్నా పట్టింపు కరువు
- హక్కులను కాలరాయొద్దంటున్న మేధావులు
గద్వాల, నవంబర్ 28 : స్థానిక సంస్థ ల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో పల్లెల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల మధ్య పోటీ పీక్ స్థాయికి చేరింది. నువ్వా.. నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఏకగ్రీవానికి రూ.కోటి వరకు వేలం పాటలు
నిర్వహిస్తుండడంతో జోగు ళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మా రింది. అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పదవులు పొం
దాలనే ఆలోచనతో పొందుపర్చిన రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కొందరు అపహస్యం చేస్తున్నారు.
డబ్బులుంటేనే పదవులకు అర్హులు అనే చందంగా స్థానిక సంస్థలు సర్పంచుల ఎన్నికల తీరు కొనసాగుతున్నది. పేద, బడుగు వర్గాల వా రు ఎన్నికల బరిలో నిలబడాలని ఆసక్తి ఉన్నా పోటీ చేయలేక పోతున్నారు. ఏకగ్రీవమనే ముసుగు తొడిగి వేలం పాట లు లక్షల్లో కొనసాగుతుండడంతో ఆర్థికంగా లేని వారు బరిలో నిలబడలేకపోతున్నారు. సంపన్నులు మాత్రమే సర్ప ంచుల ఎన్నిక తప్పా.. గ్రామాభివృద్ధిని కోరే వారు ఎన్నిక కావడానికి అవకాశం ఉండదు. పదవులను కొనుగోలు చేసే పంచాయతీలపై అధికారులు దృష్టి సారించాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఈసీ ఆగ్రహం..
సర్పంచు పదవులకు వేలం పాట నిర్వహించి పదవుల కొనుగోలు పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి నా పాలకులు, అధికారులు ప ట్టించుకోవడం లేదు. సర్పంచ్ పదవులను అంగట్లో సరుకుగా మార్చి డబ్బులు కుమ్మరించి కొ నుగోలు చేయడం సరికాదని ఆగ్రహం వ్య క్తం చేసినప్పటికీ జి ల్లాలో వేలం పాటలు కొనసాగుతూనే ఉన్నా యి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిసినా డబ్బు ఎదుట పని చేయడం లేదు.
రెండో రోజూ వేలం
గద్వాల నియోజకవర్గంలో రెండో రోజూ సర్పంచ్ పదవులకు వేలం పాట నిర్వహించి, దానికి ఏకగ్రీవమనే పేరు పెట్టి పదవులు కైవ సం చేసుకున్నారు. గురువారం గద్వాల మండలం కొండపల్లి, గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి, కేటీదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్ పదవులకు వేలం నిర్వ హించగా.. శుక్రవారం చాలా గ్రా మాల్లో సర్పంచ్ పదవులకు వే లం పాట ద్వారా కైవసం చేసుకున్నారు. గట్టు మండలం మిట్టదొ డ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకంగా రూ.90లక్షలకు కొనుగోలు చేశారంటే గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతున్నది. దీంతోపాటు అదే మండలంలో తుమ్మలపల్లి సర్పంచ్ స్థానానికి రూ.30 లక్షలు, ఆరగిద్ద రూ. 31 లక్షలు, తారాపురం రూ. 16.20 లక్షలు, ముచ్చోనిపల్లి రూ. 14. 90లక్షలు, పెంచికలపాడ్ 30.50 లక్షలు, కేటీదొడ్డి మండలం ఉమిత్యాలతండా రూ.12లక్షలు, సు ల్తాన్పురం పంచాయతీని వేలంపాటలో దక్కించుకున్నారు.
గ ద్వాల మండలంలో నల్లదేవునిపల్లి(కుర్వపల్లి) సర్పంచ్ స్థానానికి రూ.45లక్షలు, వీరాపురం సర్పం చ్ స్థానానికి రూ.50లక్షలు, ఈ డ్గోనిపల్లి సర్పంచ్ స్థానానికి రూ. 9.80లక్షలు, పుటాన్పల్లి సర్పం చ్ స్థానానికి రూ.15లక్షలు వేలం పాట పాడి సర్పంచ్ పదవులు దక్కించుకున్నారు. మల్దకల్ మం డలం సద్దలోనిపల్లి సర్పంచ్ స్థా నాన్ని రూ.42లక్షలు, మంగంపే ట రూ.14లక్షలు, అడవిరావుల చెరువు రూ.12లక్షలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. ఇలా గద్వాల నియోజకవర్గంలో సర్పంచుల పదవులకు జోరుగా వేలం పాటలు కొనసాగిడానికి ఏకగ్రీం అని పేరు పెట్టి సర్పంచు పదువులు పొందుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

