ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
- కలెక్టర్ బదావత్ సంతోశ్
తిమ్మాజిపేట, జూలై 23 : ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. రుణమాఫీ పరిష్కార కేంద్రం సందర్శించారు. ప్రజాపాల న కేంద్రాన్ని పరిశీలించి బ్యాంకులో రుణమాఫీ ప్రక్రియను పరిశీలించారు. ప్రజాపాలన దరఖాస్తు దారులు 200 యూనిట్ల ఉచిత విద్యు త్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పొందేందుకు లబ్ధిదారుల దరఖాస్తుల సవరణ కేంద్రా న్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూ చనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు దొ ర్లిన అర్హులైన లబ్ధిదారులను అసౌకర్యాలకు గు రిచేయకుండా తప్పులను సరిచేసి ప్రభుత్వ ప థకాలు లబ్ధిదారులకు అందేవిధంగా చూడాలన్నారు. ప్రజాపాలన సవరణ కేంద్రం వద్ద లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమ సమస్యలకు పరిష్కారం కాకుంటే నేరుగా తనకు కలవచ్చని కలెక్టర్ లబ్ధిదారులకు తెలిపా రు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించా రు. అనంతరం తిమ్మాజిపేట రైతు వేదికలో కొ నసాగుతున్న రుణమాఫీ సమస్యల పరిష్కార కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడికి వ చ్చిన రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అందుకు కారణాలను రైతులకు వివరించి రుణమాఫీ డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. నేరళ్లపల్లి నుంచి వచ్చిన శాంతమ్మ తన భర్త శ్రీను ఇటీవల మనఱించాడని, తమకు రైతుబీమా డబ్బులు రాలేదని కలెక్టర్‌కు తెలిపింది. అందుకు కలెక్టర్ వెంటనే స్పందించి వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. డెత్ సర్టిఫికెట్ అందలేదని, అందిన వెంటనే రైతుబీమా డబ్బులు జమ అయ్యేలా చేస్తానన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తాసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ జీకే మోహన్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో కమలేశ్వర్, అధికారులు ఉన్నారు.
మెరుగైన విద్యను అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సంతబజార్‌లోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం 5వ తరగతి విద్యార్థులకు గణితంలో భాగహారాలు, తీసివేతలకు సంబంధించిన సామర్ధ్యాలను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనతీరును పరిశీలించారు. పాఠశాలలో వర్షానికి నీరు కారుతున్న గదిని పరిశీలించి అందుకు కావాల్సిన ప్రతిపాదనలను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రూ.9.5లక్షలతో పాఠశాలకు కావాల్సిన నిర్మాణ పనులు, మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల పరిధిలోని మంగనూర్ గ్రామ శివారులో ఉన్న 801 సర్వే నెంబర్లో ఆదర్శ పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. నియోజకవర్గ పరిధికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఆదర్శ పాఠశాల నిర్మాణానికి 20 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమిని గుర్తించాలని స్థానిక తాసీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమాదేవి, తాసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీవో రాములునాయక్, కార్యదర్శి మహేశ్ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

