జూరాలకు స్వల్ప వరద
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్ప వరద మొదలైంది. శుక్రవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,561క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,031.037 అడుగులకు (3.117 టీఎంసీలకు ప్రస్తుతం 0.000 టీఎంసీలు) చేరుకున్నది.
ధరూరు, మే 17 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్ప వరద మొదలైంది. శుక్రవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,561క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,031.037 అడుగులకు (3.117 టీఎంసీలకు ప్రస్తుతం 0.000 టీఎంసీలు) చేరుకున్నది. వరద రాకతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని అధికారులు తెలిపారు.
‘తుంగభద్ర’కూ..
అయిజ, మే 17 : ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్రా నదికి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గురువారం రాత్రి కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట దిగువ పరిధిలో కురిసిన వర్షానికి వాగులు, వంకల ద్వారా నది కి వరద చేరుతున్నది. నిన్నటి వరకు తడారిన తుంగభద్రా నదికి వరద రాకతో జలకళను సంతరించుకున్నది. ఫలితంగా నదీతీర ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తీరనున్నాయి. అయిజ మండలం, పులికల్ సమీపంలోని నాగల్‌దిన్నె వద్ద వరద నీటితో తుంగభద్రా నది జలకళను సంతరించుకున్నది. ఈ ఏడాది తుంగభద్రా నదికి ముందస్తుగా వరద రావడంతో నదీతీర ప్రాంతాల రైతు లు నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

