పెబ్బేరు, మే 17 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పెబ్బేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్న ఈ కాల్వలు అక్కడక్కడా దెబ్బతినడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. సిమెంట్ లైనింగ్ ఊడిపోవడం, రాళ్లు తేలడం వంటి సమస్యలు ఉన్నాయి. మండలం మీదుగా ప్రధాన ఎడమ కాల్వతోపాటు 17, 18, 19, 20 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పారుతుండగా.. వీటి పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు సాగులో ఉన్న ది.
కొన్నేళ్లుగా అధికారులు కాల్వల నిర్వహణను మ రిచిపోయారు. ఫలితంగా నీటిని విడుదల చేసినప్పు డు అవి మరింత కోతకు గురై గండ్లు పడే అవకాశం ఉన్నది. గతేడాది వర్షాకాలం నీటి విడుదల సమయంలోనూ పెబ్బేరు వద్ద ప్రధాన కాల్వకు గండి పడి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రతి వేసవిలో జూరా ల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాను నిలిపేస్తుంటారు. ఆ మూడు నెలల సమయంలోనైనా దెబ్బతిన్న కా ల్వలకు మరమ్మతులు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.