నాడు నిరంతరం.. నేడు ఆగమాగం
ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్ సరఫరాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రైతులు రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నిద్రాహారాలు మాని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసేవాళ్లు. చిరువ్యాపారులు దుకాణాలను బంద్ పెట్టుకునేవారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కష్టాలన్నీ తీరాయి.
- ఎటు చూసినా విద్యుత్ కోతల ముచ్చట్లే..
- చిన్న వానకు కూడా కట్‌కట
- కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంట్ బాధలు తెల్వలే
- మళ్లీ పాత రోజులు వచ్చేటట్లున్నయ్..
- గోసపడుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు
ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్ సరఫరాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రైతులు రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నిద్రాహారాలు మాని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసేవాళ్లు. చిరువ్యాపారులు దుకాణాలను బంద్ పెట్టుకునేవారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కష్టాలన్నీ తీరాయి. రాత్రింబవళ్లు కట్లు లేకుండా నిరంతర విద్యుత్ అందించారు. ఆయన ఉన్నన్ని రోజులు కరెంట్ బాధలు లేకుండా చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ చూసినా కరెంట్ కోతల మాటలే వినిపిస్తున్నాయి. చిన్న వానకు కూడా కరెంట్ పోతున్నది. నాడు నిరంతర వెలుగులు ఉంటే.. నేడు ఆగమాగం అవుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ కాంగ్రెస్ సర్కారు పాలన వద్దు బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు.
– మహబూబ్‌నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గాలివానొస్తే కట్ చేస్తున్నరు..
యాసంగి పంటలకు సాగునీరు లేక ఇబ్బందులు పడినం. కేసీఆర్ ప్రభుత్వంలో కుంటలు, చెరువులు కళకళలాడుతూ కనిపించేవి. మండుటెండలో సైతం ఆరుతడి పంటలు సాగుచేసినం. దానికి తోడు 24 గంటలు కరెంటు ఉండేది. ఇప్పుడు చిన్న గాలొచ్చినా.. వానొచ్చినా.. వెంటనే కరెంట్ కట్ చేస్తున్నరు. యాసంగిలో ఎకరం వరి నాటు వేస్తే బోర్లు అంతంత మాత్రంగానే నీళ్లు పోస్తున్నయి. కరెంట్ సక్రమంగా లేక ఎకరం పంట ఎండిపోయింది.
– రాఘవేందర్‌యాదవ్, యువ రైతు, బొమ్మరాజుపల్లి, ఊర్కొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
కరెంట్ కష్టాలు మొదలైనయ్..
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ క ష్టాలుండే. ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెలిసేది కాదు. రైతులు పొలాల వద్ద పంటలకు నీరు పా రించేందుకు అర్ధరాత్రి పోయేటోళ్లు. కరెంట్ కోసం రైతులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన కరెంట్ ఇచ్చేటోళ్లు కాదు. బోర్లు కాలిపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు ఎన్నో.. కేసీఆర్ సీఎం అయ్యాక కొన్ని రోజులకే కరెంట్ కష్టాలు తగ్గినయ్. రాత్రి కాకుండా పగటి పూటనే పంటలకు నీళ్లు పారేలా కరెంట్ ఇచ్చిండు. నాణ్యమైన కరెంట్ సరఫరాతో బోర్లు కాలిపోవడం తగ్గిపోయింది. ఇప్పుడు మల్లా కరెంట్ కష్టాలు మొదలైనయ్. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థమైతలేదు.
– వేణు, చిరు వ్యాపారి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా
కేసీఆర్‌ను ప్రశ్నించడం సరికాదు..
కరెంట్ కష్టాలు తీర్చి రైతులకు ఎంతో మేలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 3 గంటల క రెంటిస్తే గగనం. మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు మొ దలయ్యాయి. కేసీఆర్ సీఎం అయ్యాక 24 గంటల ఉచిత కరెం ట్ ఇచ్చి మాకు వెన్నుదన్నుగా నిలిచిండు. సీమాంధ్ర పాలనలో రాత్రి వేళల్లో బోర్ల వద్ద పడుకొని పాముకాట్లకు ఎంతోమంది చనిపోయారు. రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసేటోళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాక కంటినిండా నిద్రపోతున్నాం. కరెంట్ విషయంలో కేసీఆర్‌ను నిలదీయడం సరికాదు.
– వెంకటయ్య, రైతు, కుప్పగండ్ల, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
మోటర్లకు రిపేర్లు..
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి సాగునీరందించారు. అదేవిధంగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందించడంతో బోరు బావుల కింద ఏటా రెండు పంటలు సాగు చేసుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణకు ముందు కరెంట్ కోసం బోరు బావుల వద్ద రేయింబవళ్లు ఎలా పడిగాపులు గాసామో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. పదేండ్లలో ఎక్కడా రైతుల మోటర్లు కాలిపోయిన ఘటనలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇస్తున్న హెచ్చుతగ్గుల కరెంట్‌తో మోటర్లు కాలిపోతున్నాయి.
‘- రవి, రైతు, చంద్రకల్, పెద్దకొత్తపల్లి మండలం , నాగర్‌కర్నూల్ జిల్లా
రైతులంటే చిన్నచూపు..
కాంగ్రెస్ ప్ర భుత్వం, రేవంత్‌రెడ్డికి రైతులంటే చిన్నచూపు అ య్యింది. కేసీఆర్ హయాంలో మా కు రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత వి ద్యుత్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినంక వానకాలం సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతుబంధు ఇయ్యలే. రైతుబీమా ఉందో.. లేదో.. అర్థమైతలేదు. ఉచిత కరెంట్ ఎన్నిగంటలిస్తున్నరో ఆ డిపార్ట్మెంటోళ్లకే తెల్వదు. దీన్ని బట్టే రైతులపై రేవంత్‌రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థమైతుంది. కేసీఆర్ సారు మాకు న్యాయం చేస్తే.. రేవంత్‌రెడ్డి వచ్చి ముంచుతున్నడు.
– సంద బాలనర్సింహులు, రైతు, ధన్వాడ గ్రామం, నారాయణపేట జిల్లా
ఏ పనీ చేసుకోలేకపోతున్నం..
కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చినంక కరెంట్ ఎప్పుడు వస్తదో? ఎప్పుడుపోతదో తెలుస్తలే దు. కేసీఆర్ ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా పొలానికి వెళ్లి నీరు పారవెట్టెటోళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాతరోజులొచ్చినట్టయ్యింది. సమయపాలన లేకుండా కరెంట్ కోత విధిస్తుండడంతో పొలాలకు నీరు పారవెట్టేందుకు బోర్ల వద్ద కావలి కాస్తున్నం. కరెంట్ వచ్చే వరకు మోటర్ దగ్గరే పడిగాపులు కాస్తున్నాం. నీరు పారవెట్టేందుకు పొలం కాడనే ఉండాల్సి వస్తుంది. ఏ పనీ చేసుకోలేకపోతున్నం. 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నమని చెబుతున్నరు కానీ.. కరెంట్ సక్రమంగా ఉంటలేదు. కొద్దిపాటి వర్షం పడినా ఇండ్లలోని కరెంటును కూడా బంద్ చేస్తున్నరు. ఈ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే మళ్లీ పదేండ్ల కిందటి రోజులు గుర్తొస్తున్నయ్.
– కృష్ణ, రైతు, అల్లీపూర్, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
కరెంట్ లేక ఖాళీగా..
వచ్చిన రిపేర్లు చేయలేక ఊరికే కూసోవాల్సిన రోజులు వచ్చినట్లని పిస్తుంది. టెక్నాలజీ పెరిగి స్మార్ట్ టీవీలు వచ్చినంక మామూలు టీవీలు చూసేటోళ్లు కరువైండ్రు. పల్లెటూళ్ల నుంచి వచ్చే పాత టీవీ రిపేర్ల గి రాకీతోనే మేం బతుకుతున్నం. కరెంట్ ఉంటేనే రిపేర్లు చేసుకుంటం. అ ది లేకపోతే ఏ పనీ చేయలేం. వచ్చిన టీవీకి ఏ సమస్య ఉందో తెలుసు కోవాలన్నా.. దానికి రిపేరు చేయాలన్నా కరెంట్ ఉంటేనే సాధ్యం. అ లాంటిది ఊకె పోతుంటే వ్యాపారం ఎట్లా చేసుకుంటం. ఎప్పుడు వస్త దో.. ఎప్పుడు పోతదో అర్థమైతలేదు. పదేండ్లు కేసీఆర్ గవర్నమెంట్ల 24 గంటల కరెంట్ ఉండేది. ఎప్పుడు వచ్చినా టీవీలను అదేరోజు రిపేర్ చేసి ఇచ్చేవాళ్లం. ఇప్పుడేమో రిపేర్‌కు వచ్చిన టీవీలను రోజుల తరబడి షాపులోనే పెట్టుకోవాల్సి వచ్చింది. చిన్నషాపు కాబట్టి టీవీలను ఎక్కువ పెట్టుకోవడం కూడా కష్టమైతుంది. 24 గంటల కరెంటును కరెక్టుగా ఇస్తే బాగుంటది. కేసీఆర్ సారు కరెంటు విషయంలో బాగా చేసిండు. కరెం ట్ పోతదనే ఆలోచన కూడా రాకుండా చేసిండు. తెలంగాణ వస్తే కరెం ట్ ఉండదని చెప్పిన నోళ్లను మూయించి నిరంతరం వెలుగిచ్చిండు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా దూరదృష్టితో ఆలోచించి 24 గంటల కరెంటు ఇస్తే బాగుంటది. ప్రజల గురించి ఆలోచించకుండా గత సర్కారుపై కక్ష సాధింపు రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఎంత నష్టం జరిగిందనేది కాదు.. రాష్ట్ర ఆదాయం ఎలా పెంచాలనే దానిపై దృ ష్టి పెట్టాలి. అప్పుడే రైతులు, వ్యాపారులు సంతోషంగా బతుకుతరు.
– రాము, టీవీ మెకానిక్, ఆత్మకూరు, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

