గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెలు పచ్చగా ఉంటే దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందనేది నాటి నుంచి ఎందరో మహానుభావులు చెబుతున్న మాటలు.. మహనీయుల మాటలను నిజం చేసేలా.. సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. 70ఏండ్లుగా కనీస సౌకర్యాలు లేక.. ఆకలిచావులతో.. వలసలకు నెలవైన గ్రామాలు స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పచ్చనిపంటలతో పల్లెలు కళకళలాడుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం చాగదోణ గ్రామం కార్పొరేట్‌ను తలపించేలా ప్రభుత్వ పాఠశాల, చిన్నారులను కట్టుకునేలా అంగన్వాడీ కేంద్రం, తలతలా మెరిసేలా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పరిసరాల పరిశుభ్రత, మిషన్ భగీరథతో తాగునీళ్లు.. శ్మశానవాటిక, రైతువేదిక, ఆహ్లాదం పంచేలా పల్లెప్రకృతివనం, నూతన గ్రా మ పంచాయతీ ఇలా అన్నివిధాలుగా గ్రామం జిల్లాలోనే ఆదర్శగ్రామంగా అభివృద్ధిని సాధించింది.
గట్టు మండలం చాగదోణ గ్రామంలో మొత్తం 3,005 జనాభా ఉంది.1,900మంది ఓటర్లు, 3,300ఎకరాల సాగుభూమి ఉంది. ఇంటింటికీ మిషన్‌భగీరథ నల్లాలు, ప్రభుత్వ పాఠశాల నియోజకవర్గానికే ఆదర్శంగా నిలిచింది. పశువైద్యశాల, రైతువేదిక, శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనాలు, ప్రైమరీ హెల్త్‌సెంటర్ రూ.2లక్షలతో నిర్మించారు. రూ.70లక్షలతో సీసీ రోడ్లు, రూ.10లక్షలతో డ్రెయినేజీల నిర్మాణం, రూ.21లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.20లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాన్ని చిన్నారులను ఆకట్టుకునేలా రూ.2లక్షలతో రంగులు వేసి ఏర్పాటు చేశారు. చాగదోణకు అనుబంధ గ్రామమైనా కొత్తపల్లిలో రూ.25లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. రూ.10లక్షలతో ప్రాథమిక పాఠశాలకు ప్రహారీ, జెడ్పీ ఫండ్ రూ.3లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. రూ.లక్షా 50వేల కలెక్టర్ నిధుల నుంచి రోడ్డు అభివృద్ధి చేశారు. రూ.లక్షా 50వేల ఎంపీపీ నిధుల నుంచి వాటర్ ట్యాంకులు నిర్మించారు. రూ.20లక్షలతో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇలా చాగదోణతో పాటు అనుబంధ గ్రామమైన కొత్తపల్లి అభివృద్ధిలో నియోజకవర్గానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఎమ్మెల్యే సహకారం, గ్రా మస్తుల అభిమానంతో ఎంపీపీ అయ్యాను. ఎంపీపీ, ఎ మ్మెల్యే నిధులతోపాటు ప్రభు త్వం పల్లెప్రగతి కోసం విడుద ల చేసిన నిధులతో గ్రామం లో అన్ని సౌకర్యాలు కల్పించాం. సీఎం కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. సొంత ఊరుకు ఏదైనా చేయాలనే సంకల్పంతో అభివృద్ధికి కృషి చేశాను. ఇదే స్ఫూర్తితో మండల అభివృద్ధికి కూడా తనవంతు ప్రయత్నం చేస్తా.
– విజయ్‌కుమార్, ఎంపీపీ, గట్టు