పెద్దకొత్తపల్లి, సెప్టెంబర్ 1 : మండలంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద చెరువు నిండింది. అదే గ్రామానికి చెందిన రామస్వామి తన కొడుకు రామకృష్ణ, బిడ్డ రేణుక ఇద్దరు మూగవాళ్లు.
వీరితో కలిసి పెద్ద చెరువుకు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లారు. శనివారం తిరిగి వచ్చే సమయంలో వర్షం భారీగా రావడంతో వారు వ్యవసాయ పొలం దగ్గరే ఉండిపోయా రు. ఆదివారం తన వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తుండగా పెద్ద చెరువులోకి ఉధృతంగా నీరు వస్తుండడంతో వారు చెరువు దాటలేకపోయారు.
దీంతో కు టుంబసభ్యులు ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన ఎస్సై సతీశ్, తాసీల్దార్ ఇబ్రహీం అలీకి సమాచారం ఇవ్వగా వారు పుట్టి సాయంతో జాలర్లు, రెస్క్యూటీంతో కలిసి వెళ్లి పశువుల కాపరులను ఒడ్డుకు తీసుకొచ్చారు. అధికారులు వెంటనే స్పందించి పశువుల కాపరులను కా పాడడంతో రామస్వామి కుటుంబ సభ్యులు, గ్రామ స్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.