NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
NHM Employees | జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరుకుంది.
నాగర్‌కర్నూల్ : జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నాగర్‌కర్నూల్ ( Nagarkurnool ) జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మెడలో ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను ఆదుకోకపోతే తమకు ఉరి తాళ్లే దిక్కవుతాయని పేర్కొన్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, కోశాధికారి ప్రవీణ్, సభ్యులు జగన్, రామకృష్ణ రెడ్డి, సురేష్, భీముడు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

