రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు.
మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం 8 గంటలకు మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని రహదారి పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేయనున్నారు.
మక్తల్–నారాయణపేట మధ్య ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ రహదారిపై సుమారు 180 గుంతలు ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.280 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రులు ప్రకటించారు. అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, అనంతరం జూలై 13న రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి శంకుస్థాపన చేశారు. అయినా పనులు ముందుకు సాగకపోవడంతో రహదారి పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 2023 అక్టోబర్ 9న అప్పటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. రూ.280 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులను ఇకనైనా ప్రారంభించి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

