నేడే ఆటో షో
మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్‌పై వచ్చినా మన మహబూబ్‌నగర్‌లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పులతో ఉ మ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలో వాహనాల వినియోగం పెరుగుతున్నది.
- పాలమూరు బాయ్స్ కాలేజీ గ్రౌండ్ ముస్తాబు
- రెండ్రోజులు అందుబాటులోకి సరికొత్త వాహనాలు
- ఒకే వేదికపైకి బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్స్‌లు
- వాహన వినియోగదారులకు అద్భుతమైన సదవకాశం
మహబూబ్‌నగర్, నవంబర్ 28 : మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్‌పై వచ్చినా మన మహబూబ్‌నగర్‌లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పులతో ఉ మ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలో వాహనాల వినియోగం పెరుగుతున్నది. వాహనం నిత్యావసరంగా మారిన నేపథ్యంలో ప్రజల్లోనూ ఆధునిక బైక్స్, కార్ల మోడల్స్‌పై ఆసక్తి కనిపిస్తున్నది. చేతిలో పూర్తి స్థాయిలో డబ్బు లేకున్నా .. బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థలు లోన్లు ఇస్తుండడంతో రోజురోజుకూ కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువైంది. కంపెనీలు తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచడం.. ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటించడం కూడా కొనుగోళ్లు పెరగాడానికి కారణమవుతున్నది. అయితే వాహనాల మోడళ్లు, అందులో ఫీచర్లతోపాటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే లోన్ల గురించి తెలుసుకోవడం కస్టమర్లకు కొంత కష్టమవుతున్నది.
ఆన్లైన్లో అందుతున్నా సమాచారానికి ఆన్లైన్లో తేడా ఉంటుండగా.. ప్రత్యేకంగా షోరూంలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఐదారు షోరూమ్‌లు తిరిగి తెలుసుకోవాలంటే ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులు, వాహన ప్రియుల కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ మంచి అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఒకే వేదికపై బ్రాండెడ్ కంపెనీల కార్లు, బైక్‌ల గురించి అలాగే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే లోన్ల గురించి తెలుసుకోవచ్చు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ వేదికగా రెండ్రోజులు ప్రత్యేకంగా ఆటోషో నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆదివారం సాయ ంత్రం 8 గంటలకు ముగియనున్నది.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు ముఖ్య అతిథులుగా శ్రీరామ జయరామ కంపెనీ ఎండీ బెక్కెరి రాంరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం రామ్మూర్తి, యూనియన్ బ్యాంక్ ఇండియా రీజనల్ హెడ్ ఆర్. సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పాల్గొనున్నారు. 26కిపైగా ప్రముఖ కార్ల కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన కంపెనీలు ఒకే వేదికపైకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు పాల్గొననున్నాయి. సరికొత్త మోడళ్లను ప్రదర్శించనున్నాయి. సకల సమాచారం ఇవ్వనున్నా. అలాగే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పాల్గొని వారు అందిస్తున్న రుణాల గురించి వివరించనున్నాయి. ఆటోషో తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

