R S Praveen Kumar | మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
R S Praveen Kumar | తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కేటాయించకుండా మోసం చేసిందని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
నాగర్ కర్నూలు : తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కేటాయించకుండా మోసం చేసిందని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ఆరోపించారు. నాగర్ కర్నూల్ పట్టణంలో మంగళవారం మాదిగల రాజకీయ ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహించిన బహుజన మహనీయుల జయంతి ఉత్సవాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
పార్లమెంట్లో మాదిగ జాతికి ప్రాతినిధ్యం లేకుండా చేసి, మాదిగల గొంతు నొక్కడమేనని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఐక్యవేదిక నాయకులు కాంగ్రెస్ (Congress) వైఖరిని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు మాదిగలు ఎవరూ కూడా ఓటు వేయరని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , ఎంపీటీసీ మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

