నాగర్కర్నూల్ : జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పేరుతో గత కొద్దిరోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో సెల్ నెంబర్ 8278450979 నుంచి వాట్సాప్ ద్వారా పలు ఆదేశాలు, సూచనలు వెలువడుతున్నాయన్నారు.
వీటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఫోన్ నంబర్లు నుంచి వచ్చే ఆదేశాలను పట్టించుకోవద్దని జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలకు సూచించారు.
ఇలా ఎవరికైనా మెసేజ్ లు వచ్చినట్లయితే ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు సమాచారాన్ని అందజేశామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.