భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ అజ్హ
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో సోమవారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ యార్డు, జాలీహి ల్స్, న్యూగంజ్ వద్ద, పట్టణంలోని ఆయా వార్డుల్లో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
పాలమూరు, జూన్ 17 : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో సోమవారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ యార్డు, జాలీహి ల్స్, న్యూగంజ్ వద్ద, పట్టణంలోని ఆయా వార్డుల్లో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఏఐసీసీ ప్ర త్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర మై నార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వా ల్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్అలీఅహ్మద్, మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, సత్తూర్ చంద్రకుమార్గౌ డ్, సీజే బెనహర్, ఫయాజ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, పట్టణాధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూగంజ్, బోయపల్లి, ఏనుగొండ మౌళాలిగుట్ట, జాలీహిల్స్, మార్కెట్ యార్డు ఈద్గాల వద్ద ముస్లింలు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జూన్ 17 : బక్రీద్ పండగ సందర్భంగా నంచర్ల, కంచన్‌పల్లి, మొకర్లాబాద్, జూపాలపల్లి, చౌదర్పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి, శేక్‌పల్లి, మహ్మదాబాద్ తదితర గ్రామాల ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గండీడ్‌లో..
గండీడ్, జూన్ 17 : మండలంలోని వెన్నాచేడ్, సల్కర్‌పేట్, కప్లాపూర్, పెద్దవార్వల్, పగిడ్యాల్, గండీడ్, రుసుంపల్లి గ్రామాల్లో బక్రీద్ పండగను ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్ ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
జడ్చర్ల (రాజాపూర్), జూన్ 17 : మండల కేం ద్రంతోపాటు మండలంలోని చొక్కంపేట, తిర్మలాపూర్, ఖానాపూర్, చెన్నవెల్లి, కుచ్చర్కల్, రంగారెడ్డిగూడ, ఈద్గాన్‌పల్లిలో ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జడ్చర్లలో..
జడ్చర్ల, జూన్ 17 : బక్రీద్ వేడుకలను జడ్చర్ల మున్సిపాలిటీతోపాటు మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ము స్లింలకు జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర సంగీతనాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్ రమేశ్, విజయ్, సీఐ శుభాకాంక్షలు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూన్ 17 : బక్రీద్ పండుగను మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, మసిగుండ్లపల్లి, వే ముల, కొత్తపల్లి, రాణిపేట్ తదితర గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
దేవరకద్రలో..
దేవరకద్ర, జూన్ 17: మండల కేంద్రంతో పా టు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా గ్రామాల సమీపంలోని ఈద్గాల వద్దకు ర్యాలీగా వెళ్లి సామూహిక ప్రార్థనలు చేశా రు. అనంతరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), జూన్ 17: కౌ కుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పా టు అన్ని గ్రామాల్లో ముస్లింలు సోమవారం బక్రీద్ నిర్వహించారు. కొత్త దుస్తులు ధరించి, ఈద్గా మై దానం వద్ద మతగురువులు ఖురాన్‌ను చదివి వినిపించారు. సేవాభావంతో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. కౌకుంట్లలో తాసీల్దార్ ఎల్లన్న, పోలీసు అధికారులు ఈద్గా మైదానం వద్ద ఏర్పాట్లు చేశారు.
నారాయణపేటలో..
నారాయణపేట, జూన్ 17 : బక్రీద్ వేడుకలను సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బువ్వమ్మ దర్గా సమీపంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు విజయ్‌సాగర్, చెన్నారెడి,్డ మల్రెడ్డి, కాం గ్రెస్ నాయకులు శివకుమార్‌రెడ్డి, సరాఫ్ నాగరాజ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
నారాయణపేట మండలంలో..
నారాయణపేట రూరల్, జూన్ 17: పేట మం డలంలోని కోటకొండ, జాజాపూర్, కొల్లంపల్లి, సింగారం, భీమండికాలనీ తదితర గ్రామాల్లో సోమవారం బక్రీద్ పండుగ నిర్వహించారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, జూన్ 17 : మండల వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఒకరి కొకరు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, జూన్ 17 : మండలకేంద్రంతోపా టు చిన్నపొర్ల, పగిడిమర్రి, పులిమామిడి, పెద్దపొర్ల గ్రామాల్లో మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, శివరామరాజు, గోపాల్‌రెడ్డి, గోవిందప్ప, శ్రీనివాసులు ముస్లింలకు పం డుగ శుభాకాంక్షలు తెలిపారు.
మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో..
మద్దూర్ (కొత్తపల్లి), జూన్ 17 : మద్దూర్, కొ త్తపల్లి మండలాల్లో బక్రీద్ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. మద్దూరులో ఆనవాయితీ ప్రకా రం కర్ణం రాఘవయ్య ఇంటి వద్ద బీడా ఇచ్చి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మరికల్ మండలంలో..
మరికల్, జూన్ 17 : మండలంలో బక్రీద్‌ను పండుగను సోమవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ధన్వాడలో..
ధన్వాడ, జూన్ 17 : ధన్వాడలోని పాతపల్లి రో డ్డు సమీపంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు రహెమాన్‌ఖాన్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు తాజొద్దీన్, డీలర్బాబా, రఫీయొద్దీన్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 17 : బక్రీద్ సందర్భంగా సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలానగర్, నేరాళ్లపల్లి, మోతీగణపూర్, పెద్దరేవల్లి, చిన్నరేవల్లి తదితర గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

