జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మిపై గురువారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో దోరెపల్లి లక్ష్మి చైర్పర్సన్ పదవిని కోల్పోయారు. ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చైర్‌పర్సన్‌కు అనుకూలంగా ఓ టు వేయకపోవడం గమనార్హం.
- చైర్పర్సన్ పదవిని కోల్పోయిన లక్ష్మి
- అవిశ్వాసానికి అనుకూలంగా 26 ఓట్లు
- ఆర్డీవో సమక్షంలో నిర్వహణ
జడ్చర్ల, జూలై 25 : జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మిపై గురువారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో దోరెపల్లి లక్ష్మి చైర్పర్సన్ పదవిని కోల్పోయారు. ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చైర్‌పర్సన్‌కు అనుకూలంగా ఓ టు వేయకపోవడం గమనార్హం. జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ ఒంటరి పోకడలు పోతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు గత నెలలో కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నోటీసు ఇచ్చారు.
వారి వినతి మేరకు జూలై 25న అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో నవీన్, కమిషనర్ రాజయ్య సమక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27మంది కౌ న్సిలర్లు ఉండగా అందులో చైర్పర్సన్ లక్ష్మి గైర్హాజరు కా గా ఈ సమావేశానికి బీఆర్ఎస్ (19), కాంగ్రెస్ (6), బీజే పీ (1)లకు చెందిన 26 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ ఒకే వాహనంలో నేరుగా కార్యాలయానికి వచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 26 మంది చేతులు లేపి తమ మద్దతు ప్రకటించారు.
దీం తో చైర్పర్సన్ లక్ష్మిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో నవీన్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే అవిశ్వాసం ఎదుర్కోవడం, చైర్‌పర్సన్‌పై వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్, బీ జేపీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మా జీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు తమ పార్టీ కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో చైర్మన్‌ను ఎన్నుకోవడం జరుగుతుంద ని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్ల్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్, దేవా, లత, చైతన్య, సారిక ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

