మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
- మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నవాబ్‌పేట, మార్చి 13 : మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అ ధికారులు, పాలకవర్గ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ ఆవరణలో ఎంపీని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే ఎంతో పేరుగాంచిన అమ్మవారి ఆలయా న్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నా రు. త్వరలోనే అటవీ అధికారుల అనుమతి తీసుకొని ఇక్కడ భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అ నంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, ఆ లయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, ఈవో మదనేశ్వర్రె డ్డి, మాజీ చైర్మన్ గోపాల్, నాయకులు మధుసూదన్‌రెడ్డి, కృష్ణగౌడ్, మాధవులు తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

