పోలీసుల నిర్లక్ష్యం వల్లే వరుస చోరీలు
గద్వాల ప్రాంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీలో వీరప్రసాద్ ఇంట్లో గుర్తు తెలియని దుండగలు చొరబడి చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా..
- చోరీలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల అర్బన్, జూన్ 21 : గద్వాల ప్రాంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీలో వీరప్రసాద్ ఇంట్లో గుర్తు తెలియని దుండగలు చొరబడి చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరప్రసాద్ తన కుటుంబ సభ్యులతో నంద్యాల ప్రాంతానికి వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసిన దుండగులు ఇంట్లోకి చొరబడి 30తులాల బంగారు, రూ.3,50,000 నగదును అపహరించుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం చోరీకి గురైన ఇంటిని పరిశీలించి బాధితుడు వీరప్రసాద్‌ను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని సీఐ భీమ్‌కుమార్ పరిశీలిస్తుండగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు నిద్రపోతున్నారా అని నిలదీశారు. ఈ రెండు, మూడు నెలలో జిల్లా కేంద్రంలో దాదాపు 200పైగా దొంగతనాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి దొంగతనాలు లేకుండా శాంతిభద్రతలు కాపాడుతూ పోలీస్ వ్యవస్థ పనిచేసేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకొని దాచుకున్న డబ్బు దొంగల పాలు అవుతున్నది. ప్రజలను రక్షించలేని పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే వరుస దొంగతనాలపై డీఎస్పీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు.
ఇదేవిధంగా భవిష్యత్తులో జరిగితే రాష్ట్ర పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, ఈ విషయంపై త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తానన్నారు. జిల్లా కేంద్రంలో నా సొంత ఖర్చులతో దాదాపు రూ.30లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా.. లేవా ? పోలీస్‌లు పట్టించుకోవడమే లేదా అని ప్రశ్నించారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, బాబర్, నాగిరెడ్డి, శ్రీనివాసులు, షూకూర్, గోవిందు, ధర్మనాయుడు, అజయ్, రిజ్వాన్, మోబీన్, విజయ్, వీరేశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

