నారాయణపేట, డిసెంబర్ 18 : జిల్లాల ఏర్పాటుతో ప్రజల కు మరింత చెరువలో సేవలు అందించవచ్చననే ఉద్దేశంతో రా ష్ట్రంలో 10 జిల్లాల నుంచి 33 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్త యింది. ప్రజలకు సేవలు అందుతున్నాయని చెప్పడానికి నిదర్శనమే నారాయణపేట రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీవో) కార్యాలయం. అప్పటి వరకు లైసెన్స్ తీసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాహన యజమాని పేరు మార్పిడి చేసుకోవాలన్నా ఆఖరకు ఆర్టీవో కార్యాలయానికి సంబంధించి ఏ చిన్న పని కా వాలన్నా మహబూబ్‌నగర్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సి న పరిస్థితి ఉండేది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నారాయణపేట డివిజన్ సైతం జిల్లాగా ఆవిర్భవించడంతో జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను నారాయణపేటలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆర్టీవో కార్యాలయాన్ని యాద్గీర్ రోడ్డు మార్గంలో 2021 సెప్టెంబర్ 17న ప్రారంభించారు. అప్ప టి నుంచి క్రమం తప్పకుండా సేవలు అందుతూ వస్తున్నాయి. మొదటి ఇన్చార్జి ఆర్టీవోగా నియమితులైన లాల్కోట వీరస్వామి నేతృత్వంలో మొత్తం ముగ్గురు ఎంవీఐలు, ముగ్గురు అసిస్టెంట్ ఎంవీఐలు, సిబ్బంది ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేసి న కూడా నేటికి తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో కృష్ణ చెక్‌పోస్టు మాత్రం మహబూబ్‌నగర్ డిప్యూటీ డీటీవో పర్యవేక్షణలో కొనసాగుతుండడం గమనార్హం. అక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు డాటాబేస్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు విధులు చేపడుతున్నారు.
అందుతున్న సేవలు
ఆర్టీవో కార్యాలయంలో ద్విచక్ర వాహనాలు, మూడు చక్రా ల వాహనాలు, నాలుగు, ఆరు చక్రాల వాహనాలను నడిపేందుకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. వీటితోపాటు మోటర్ క్యా బ్స్, ట్రాన్స్‌పోర్టు, హేవీ వెయికిల్స్ వాహనాలను నడిపేందుకు అర్హులైన వారికి లైసెన్సులు జారీ చేస్తున్నారు. పదో తరగతి, ఆ ధార్ కార్డు జిరాక్స్‌లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మొదటగా నెల రోజుల నుంచి ఆరు నెలల కాలపరిమితి కలిగిన తాత్కాలిక లైసెన్స్, ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్‌లో పాసైన వారి కి శాశ్వత లైసెన్సులు జారీ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ పర్మిట్
విదేశాలకు వెళ్లే వారు అక్కడ వాహనం నడిపేందుకు ఇంటర్నేషనల్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూ డా ఆర్టీవో కార్యాలయం లో జారీ చేస్తున్నారు. అం దు కోసం శాశ్వత లైసెన్స్ కలిగి ఉండి, పాస్‌పోర్టు, వీ సా, టికెట్ పత్రాలను సమర్పిస్తే ఏడాది కాలానికి అ వసరమైన ఇంటర్నేషనల్ పర్మిట్ లైసెన్స్‌ను తక్షణమే జారీ చేస్తున్నారు. లైసెన్స్ విదేశాల్లో విద్యాభ్యాసం, ఉద్యోగం చేసే వారికి ఎంతో ఉపయోగపడుతున్నది.
11వేలకు పైగా రిజిస్ట్రేషన్లు
ఆర్టీవో కార్యాలయం ప్రారంభించి నేటికీ ఏడాది కాలంపైగా పూర్తి అయ్యింది. ఏడాది కాలంలో దాదా పు 11వేలకు పైగా వివిధ రకాల రిజిస్ట్రేషన్లు అయ్యా యి. వీటిలో 8,781 నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల కు, 1,514 ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేశారు. అదేవిధంగా 9,456 మందికి లర్నింగ్ లైసెన్స్‌లు, 6,3 72 మందికి శాశ్వత లైసెన్స్‌లు, 2250 ఫిట్నెస్ సర్టిఫికెట్లను జా రీ చేశారు. ఆర్టీవో కార్యాలయం నుంచి ప్రభుత్వానికి రూ.4 కో ట్ల ఆదాయం వివిధ రకాల సేవలతో సమకూరాయి.
లైసెన్స్‌కు వీరు అర్హులు
18 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతిఒక్కరూ లర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్తో ఆన్లైన్లో లర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వారికి నెల రోజుల నుంచి ఆరు నెలల కాలపరిమితితో కూడిన తాత్కాలిక లైసెన్స్‌ను మం జూరు చేస్తారు. ఇలా తాత్కాలిక లైసెన్స్ తీసుకున్న ఒక నెల రో జుల తర్వాత ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ పాసైతే వారికి శాశ్వత లైసెన్స్ జారీ చేస్తారు.
ప్రతిఒక్కరికీ లైసెన్స్ ఉండాలి
ద్విచక్ర వాహనం నుంచి హేవీ వెయికిల్స్ నడిపే ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. జిల్లాలో చాలా మంది వాహనాలు నడుపుతున్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం లేదు. అర్హులైన వారు తప్పనిసరిగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లు లేకుండా నేటికి రోడ్ల వెంట అలాంటి వాహనాలు దర్శనమిస్తున్నాయి. తమ తనిఖీల్లో అలాంటి వాహనాలు పట్టుపడితే సీజ్ చేయడం జరుగుతున్నది. వాహనాలకు వెనుక వైపు రేడియం స్టిక్కర్లు అంటించాలని, దీని వల్ల రాత్రుల సమయంలో వెనుక వచ్చే వాహనానికి ముందు వాహనం వెళ్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. గూడ్స్ వాహనాల్లో ప్యాసింజర్లను తరలిస్తున్నారు, అలాంటి వాహనాలను సీజ్ చేయడం జరుగుతున్నది. ప్రతిఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్‌ను పాటిస్తూ వాహనాలను నడిపించాలి.
– వీరాస్వామి, ఆర్టీవో
ఆన్లైన్ వర్క్‌తో ఉపాధి
ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు కావడంతో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. నేను టీటీసీ, బీఈడీ విద్యను అభ్యసించాను. ఒక వైపు డీఎస్సీ కోసం ఫ్రిపేర్ అవుతూనే మరో పక్క ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఆర్టీవో కార్యాలయం వద్ద ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నాను. తమ మాదిరిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి డీడీలు తీసి ఇవ్వడంలో సహాయపడుతున్నాను. అదేవిధంగా లైసెన్స్ కోసం వచ్చే నిరాక్షరాస్యులకు సహాయపడుతున్నాను.
– వెంకటప్ప, ఉట్కూర్.