మహానటి సందడి
ప్రముఖ సినీనటి, మహానటి ఫేం కీర్తిసురేశ్ పాలమూరులో సందడి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎక్స్టెన్షన్ కౌంటర్లను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో గడియారం చౌరస్తా అభిమానులతో నిండిపోయింది. తమ అభిమాన నటితో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.
సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన సినీనటి కీర్తిసురేశ్ అలరించిన జబర్దస్త్ టీం మాల్‌ను సందర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 15 : ప్రముఖ సినీనటి, మహానటి ఫేం కీర్తిసురేశ్ పాలమూరులో సందడి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎక్స్టెన్షన్ కౌంటర్లను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో గడియారం చౌరస్తా అభిమానులతో నిండిపోయింది. తమ అభిమాన నటితో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. షోరూం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపు వద్దకు వచ్చి అభిమానులను కీర్తి పలుకరించారు. మీ అభిమానం ఎప్పటి ఇలాగే ఉండాలని దీవించాలని కోరారు.
అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. కారులో చేరగానే అభిమానులు కేరింతలు వేశారు. అలాగే మాల్ ప్రారంభోత్సవానికి జబర్దస్త్ ఫేం హైపర్ ఆది టీం కామెడీ షో అలరించింది. ప్రముఖ యాంకర్ సావిత్రితో పాటు వేషధారణల్లో జూనియర్ ఆర్టిస్టులు సందడి చేశారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు, బౌన్సర్లు తంటాలు పడ్డారు. సుమారు 5 లక్షల వెరైటీలను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు సీఎంఆర్ ఎండీ సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ షోరూంను సందర్శించి యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

