పాలమూరు సిగలో కలికితురాయి
పాలమూరులో మరో ప్రతిష్టాత్మక విద్యాలయం రాబోతున్నది. ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, డిగ్రీ జూనియర్ కాలేజీలతోపాటు కస్తూర్బా, జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు.. అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయి.
- ఎడ్యుకేషన్ హబ్‌గా మారనున్న మహబూబ్‌నగర్
- జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు జీవో జారీ
- 30 ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణం
- ఇక్కడ చదివిన వారికి ఐటీ హబ్‌లో ప్లేస్మెంట్లు
- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
మహబూబ్‌నగర్ అక్టోబర్ 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులో మరో ప్రతిష్టాత్మక విద్యాలయం రాబోతున్నది. ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, డిగ్రీ జూనియర్ కాలేజీలతోపాటు కస్తూర్బా, జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు.. అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయి. ఇదే కోవలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నెల సెప్టెంబర్ 16న సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన రోజే మహబూబ్‌నగర్‌లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జీవో నెంబర్ 76 ద్వారా ఈనెల 4న జీవో విడుదలైంది. దీంతో ఈనెల 6వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు, మంత్రి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
30 ఎకరాల్లో కాలేజీ క్యాంపస్..
పాలమూరు పట్టణానికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల రావడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 30 ఎకరాల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇక్కడి విద్యార్థులకు హైదరాబాద్‌లో ఉండే కళాశాలలకు దీటుగా అన్ని వసతులతో ఇంజినీరింగ్ కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి చెప్పారు. ఎలాంటి లోటు లేకుండా క్యాంపస్ ఏర్పాటు చేసి అన్ని వసతులు అందిస్తామని పేర్కొన్నారు..
ఎడ్యుకేషన్ హబ్‌గా పాలమూరు..
మహబూబ్‌నగర్ పట్టణం ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతున్నది. గతంలో ప్రభుత్వపరంగా ఉన్న కళాశాలలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు. పేద విద్యార్థులకు విద్యను అందకుండా దూరం చేశారు. ఫలితంగా చదివితే ప్రైవేట్ కాలేజీల్లో లేకపోతే ఏదో పని చేసుకుని బతికేలా విద్యార్థులను మానసికంగా చదువుకు దూరం చేశారు. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్ జిల్లా ఏకంగా ఎడ్యుకేషన్ హబ్‌గా అవతరించింది. తొలి మెడికల్ కాలేజీని అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జిల్లాకు తీసుకొచ్చారు. 2018లో మెడికల్ కాలేజీ నిర్మించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అట్టహాసంగా ప్రారంభించారు. 2018 ఎన్నికల తర్వాత మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్ నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, డిగ్రీ కాలేజీలు, కస్తూర్బా జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజీలు, అనేక రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పి మహబూబ్‌నగర్‌ను విద్యాహబ్‌గా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు ఫుల్ అవుతున్నాయి. దీనికి అనుబంధంగా పాలిటెక్నిక్, సాంకేతిక కళాశాలలో కూడా వసతులు మెరుగుపర్చడంతో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీ నికి తోడు జిల్లా కేంద్రంలో స్టేడియంలో వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించారు.
జేఎన్టీయూ రాకతో విద్యార్థుల హర్షం..
మహబూబ్‌నగర్ పట్టణానికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల రావడంతో విద్యార్థులు సంబురపడుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఇంత పెద్దఎత్తున సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వాలు ఏవీ లేవని, వారంతా ముక్తకంఠంతో నినదించారు. కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు.
పాలమూరుపై సీఎంకు ప్రత్యేక ప్రేమ..
మహబూబ్‌నగర్ జిల్లాకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కావాలని ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మంజూరు చేసి 15 రోజుల్లోనే జీవోను ఇవ్వడం సీఎం కేసీఆర్ పాలమూరుపై ఉన్న ప్రేమకు నిదర్శనం. పేద విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినా దూరంగా వెళ్లి చదవలేక మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు ఇంజినీరింగ్ కళాశాల రావడం మనందరం అదృష్టం. ఇక్కడ చదువుకున్న ఇంజినీర్లను ఐటీ పార్కు అనుసంధానం చేసి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

